దేశానికి ఆదర్శప్రాయుడు.. అబుల్ కలాం


Tue,November 12, 2019 04:12 AM

వనపర్తి విద్యావిభా గం : తొలి విద్యాశాఖ మంత్రి, స్వాతంత్య్ర సమరయోధుడు మౌ లానా అబుల్ కలాం ఆజాద్ దేశానికే ఆదర్శప్రాయుడని మైనార్టీ పాఠశాలల డీఎల్‌సీ గు లాం హుస్సేన్ అన్నా రు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ కళాశాల మైదానం, ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో వైస్ ప్రిన్సిపల్ శ్రీనివాసులు, మైనార్టీ గురుకుల బాలుర, బాలికల ఉన్నత పాఠశాలలో డీఎల్‌సీ గులాం హుస్సేన్ వేర్వేరుగా జాతీయ విద్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గులాం హుస్సేన్ మాట్లాడుతూ మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని దేశవ్యాప్తంగా జాతీయ విద్యా దినోత్సవం, జాతీయ ముస్లిం దినోత్సవంగా జరుపుకుంటారన్నారు. దేశ ప్రజలందరు విద్యావంతులైనప్పుడే దేశ అభివృద్ధి జరుగుతుందని ఆజాద్ చెప్పారన్నారు. స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న సమయంలో ఆల్ ఇలానీ వార పత్రికను, ఆల్ క్లబ్ అనే మాస పత్రికను స్థాపించి జాతీయ విప్లవ ఆలోచనలను భారతీయుల్లో రగిలించారన్నారు. ఆయా కార్యక్రమాల్లో ఉద్యోగ, ప్రజా సంఘాల, పార్టీల నాయకులు చంద్రయ్య, ఖాదర్‌పాష, జహిర్, రఫీక్, సోహెల్, మున్నావర్, గోపిగౌడ్, చలపతి, కృష్ణ, గిరిరాజయ్య, వెంకటయ్య, రవీందర్‌గౌడ్, బీసన్ననాయుడు, బాలస్వామి, ఎన్‌సీసీ లెఫ్లినెంట్ అధికారి శ్రీనివాసులు, ప్రవీణ్‌కుమార్, ఉదయ్‌కుమార్, సురేందర్‌రెడ్డి, దాంసింగ్, ప్రిన్సిపల్స్ జనార్దన్‌గౌడ్, మద్దిలేటి, షాకీర్ హుస్సేన్ ఉన్నారు.

32
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...