భక్తి శ్రద్ధలతో మిలాద్ ఉన్ నబీ


Mon,November 11, 2019 02:49 AM

-విద్యుద్దీపాల కాంతుల్లో మసీదులు
-జాగరణ చేసిన ముస్లింలు
-వనపర్తి జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ
-మతసామరస్యానికి ప్రతీకగా పండుగలు జరుపుకోవాలని పలువురి పిలుపు

వనపర్తి వైద్యం/రూరల్/పెబ్బేరు/పాన్‌గల్ : ముస్లింలు ప్రాణానికి మిన్నగా ప్రేమించే, దైవప్రవక్తగా భావించే మహమ్మద్ ప్రవక్త (మిలాద్-ఉన్-నబీ) జన్మదినం వేడుకలను పురస్కరించుకుని ఆదివారం జిల్లా కేంద్రంతో పాటు ఆయా మండల కేంద్రాలలో ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు. ముస్లింల ఆరాధ్య ధైవ్యం మహమ్మద్ ప్రవక్త సలాల్లా ఇస్లాం అంటే మతం కాదని జీవన విధానమని ప్రవక్త బోధించారని ముస్లిం మత పెద్ద మైసన్ తెలిపారు. జిల్లా కేంద్రంలో గాంధీచౌక్‌లో మసీద్ నుంచి నిర్వహించిన ర్యాలీలో సందేశానిచ్చారు. దైవంపై భయం, భక్తి, ప్రేమ కలిగి ఉండాలని ప్రబోధించారు. దేశంలోని హిందూ, ముస్లింల ఐక్యతకు చిహ్నంగా ప్రతి పండుగను జరుపుకోవటం ఒక్క భారతదేశంలోనే ఉందని తెలిపారు. వనపర్తి జిల్లాలో మతసామర్యసానికి పత్రిక గా కలిసిమెలిసి ఉంటామని అన్నారు. మహమ్మద్ ప్రవక్త జన్మదిన ప్రత్యేకతను మత పెద్దలు చాటి చెప్పారు. ఇస్లాం మత గ్రంథాన్ని ఖురాన్‌ను వెలుగులోకి తీసుకువచ్చి ఇస్లాం యొక్క గొప్పతనం గురిం చి మత పెద్దలు వివరించారు. అనంతరం జామియా మసీ ద్ నందు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే పాన్‌గల్ మండలంలో మహ్మద్ ప్రవక్త జన్మదినం పురష్కరించుకొని మండల కేంద్రంలోని మహబూబ్ దర్గా వద్ద మిలాద్-ఉన్-నబీ ఉత్సవాలను ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు రాముయాదవ్ మాట్లాడుతూ ప్రేమ, సోదరభావం పెంపొ ందించేలా మహ్మద్ ప్రవక్త కృషి చేశారని అన్నారు.

అనాథాశ్రమంలో..
వనపర్తి మండలంలోని చిట్యాల గ్రామ శివారులో గల చేయూత అనాథ ఆశ్రమంలో ఆదివారం ముస్లిం యువకులు వంట సామగ్రి, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జామియా మజీద్ ఇమామ్ అన్వర్ మౌలానా మాట్లాడుతూ మహ్మద్ జన్మదిన వేడుకలను చిన్నారుల మధ్య నిర్వహించుకోవటం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ సృష్టిలో భగవంతుడు ఒక్కడేనని, పేర్లు మాత్రమే వేరు అన్నారు. కార్యక్రమంలో సాయికుమార్‌రెడ్డి, నవీన్‌కుమార్‌రెడ్డి, యాసీఫ్‌ఖాన్, ఎండీ బాబా, చాంద్‌పాష, ఆరిఫ్, వజీర్, ఖలీమ్, ముస్లింలు నాయకులు, యువజన నాయుకలు పాల్గొన్నారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...