రాష్ట్రస్థాయి టార్గెట్ బాల్ పోటీలు షురూ


Mon,November 11, 2019 02:46 AM

ఎదులాపురం: 65వ రాష్ట్రస్థాయి అండర్-17,19 బాలబాలికల విభాగంలో టార్గెట్ బాల్ పోటీలు ఆదివారం ప్రారంభం అయ్యాయి. జిల్లా కేంద్రంలోని న్యూహౌజింగ్ బోర్డులో గల మహాత్మజ్యోతి బాపూలే బాలుర గురుకుల పాఠశాల ఆవరణలో ఎస్‌జీఎఫ్ జిల్లా పాఠశాల క్రీడా స మాఖ్య ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించారు. ఉమ్మడి పది జిల్లాల నుంచి 400ల మంది క్రీడాకారులు హాజరయ్యారు. ఈ పోటీలను ప్రారంభించేందుకు ఆదిలాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే జోగురామన్న హాజరయ్యారు. ప్రారంబోత్సవానికి హాజరైన అతిథులకు బ్యాండ్ చప్పుళ్ల మధ్య ఘనస్వాగతం పలికారు. అనంతరం క్రీడాకారులచే అతిథులకు గౌరవ వందనం స్వీకరించి పోటీలను లాంచనంగా ప్రారంభిస్తున్నట్లు ఎమ్మెల్యేజోగురామన్న ప్రకటించారు.

ప్రభుత్వం క్రీడాకారులకు అండగా
తెలంగాణ ప్రభుత్వం క్రీడాకారులకు అన్ని విధాలుగా అండగా ఉంటు సహయ సహాకారాలు అందిస్తున్నారని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ ఆరె రాజన్న, మావల ఎంపీపీ చందాల ఈశ్వరి, మావల జెడ్పీటీసీ నల్లవనిత రాజేశ్వర్, మావల సర్పంచ్ దొగ్గిలి ప్రమీళ, ఏఎంసీ చైర్మన్ మెట్టుప్రహ్లాద్, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు అడ్డిబోజారెడ్డి, జైనథ్ ఎంపీపీ గోవర్థన్, పేట సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పార్థశారథి, కృష్ణ, ఎస్‌జీఎఫ్ సెక్రటరీ గుండి మహేశ్, బీసీ గురుకులాల ఆర్సీవో గోపిచంద్ రాథోడ్, పాఠశాల ప్రిన్సిపల్ ప్ర తిభ, టీటీ సంఘం అధ్యక్షుడు రాష్ట్రపాల్, పోటీల కన్వీనర్ స్వామి, పీఈటీలు, పీడీలు కృష్ణ, సత్యనారాయణగౌడ్, రే ణుకా, జ్యోతి, సంగీత, సాయికుమార్, హరిచరణ్, రాకేశ్ తదితరులు ఉన్నారు.

35
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...