కరాటేతో ఆత్మరక్షణ


Mon,November 11, 2019 02:45 AM

- ఫుట్‌బాల్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటేశ్
మహబూబ్‌నగర్ స్పోర్ట్స్ : కరాటేతో ఆత్మరక్షణ ఉంటుందని ఫుట్‌బాల్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్పీ వెంకటేశ్ అన్నారు. జపాన్ కరాటే అసోసియేషన్ షోటోకాన్ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలో విద్యార్థులకు బెల్టు గ్రేడింగ్ పరీక్షల్లో ప్రతిభకనబర్చిన విద్యార్థులకు బెల్టులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని సూచించారు. ప్రస్తుతం సమాజంలో ప్రతి ఒక్కరూ కరాటే నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కాగా, ఈ పోటీల్లో అఖిలాన్, స్వాతిక్ గౌడ్, సాయి కీర్తన, శ్రీవర్దన్, నమ్రత, సాయి ఆనంద్, దుర్గాప్రసాద్, కృష్ణసాయి, సులోచన, ఆర్యన్ యాదవ్, క్రితీక, యామిన్‌లు బెల్టులు సాధించారని రాష్ట్ర పాఠశాలల క్రీడల కరాటే అసోసియేషన్ అధ్యక్షుడు ఎతినె చెన్నయ్య తెలిపారు. కార్యక్రమంలో టీఎన్‌జీవోఎస్ మాజీ అధ్యక్షుడు రాజేందర్, శ్రీనివాసులు, శోభన్‌యాదవ్, నర్సప్ప తదితరులు పాల్గొన్నారు.

23
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...