చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి


Sun,November 10, 2019 01:41 AM

వనపర్తి టౌన్ : చట్టాలపై ప్రతి ఒక్క రూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా 9వ అదనపు జడ్జి శ్రీనివాసులు, జూనియర్ సివిల్ జడ్జి ఇందిరలు అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని బాలికల, బాలుర ఉన్నత పాఠశాలల్లో న్యాయసేవ విజ్ఞాన సదస్సులను నిర్వహించా రు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ లీగల్ సర్వీసెస్, ఆథార్టీ చట్టాలు, ప్రాథమిక చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. న్యాయవ్యవస్థ పనితీరు, విధానంపై విద్యార్థులకు వివరించారు. అంతకుముందు కోర్టు నుం చి న్యాయమూర్తులు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రవీందర్, విజయ, భాస్కర్, రాంచంద్రారెడ్డి, శ్రీనివాసచా రి, కృష్ణయ్య, విష్ణువర్దన్‌రెడ్డి, చంద్ర, హెచ్‌ఎంలు తారాబాయ్, గాయత్రి, ఉపాధ్యాయులు ఉన్నారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...