ఆటలు అదుర్స్


Sun,November 10, 2019 01:41 AM

పెబ్బేరు : పెబ్బేరు పట్టణ కేంద్రంలోని ప్రియదర్శిని జూరాల కార్యాలయ ఆవరణలో నిర్వహిస్తున్న అండర్-19 బాలుర రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ పోటీలు రెండో రోజు శనివారం ఉత్కంఠభరితంగా సాగాయి. క్రీడాకారులు పోటీపడుతూ ఆడటంతో క్రీడలు రసవత్తరంగా సాగాయి. క్రీడాకారులు నైపుణ్యతను ప్రదర్శిస్తూ పోటీల్లో తలపడ్డారు.
రెండో రోజు లీగ్ మ్యాచ్ వివరాలు..
మహబూబ్‌నగర్ జట్టు నల్లగ్గొండ జట్టుపై 2-0తో వి జయం, నిజామాబాద్ జట్టు ఖమ్మంపై 2-0తో విజ యం, ఆదిలాబాద్ జట్టు వరంగల్ జట్టుపై 6-0తో విజ యం, రంగారెడ్డి జట్టు మెదక్ జట్టుపై 10-0తో విజ యం, హైదరాబాద్-నిజామాబాద్ జట్లు 0-0తో డ్రా, నల్లగొండ-కరీంనగర్ జట్లు 0-0తో డ్రా, నిజామాబాద్ జట్టు వరంగల్ జట్టుపై 4-0తో విజయం, ఆదిలాబాద్ జట్టు ఖమ్మం జట్టుపై 3-0తో విజయం, రంగారెడ్డి జట్టు నల్లగొండ జట్టుపై 2-0తో విజయం, హైదరాబాద్ జట్టు వరంగల్ జట్టుపై 4-0తో విజయం, కరీంనగర్-మెదక్ జట్లు 1-1తో డ్రా, ఆదిలాబాద్-హైదరాబాద్ జట్లు 0-0తో డ్రాతో ముగిసాయి.రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ పోటీల్లో భాగంగా మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, ఆదిలాబాద్ జట్లు సెమీఫైనల్‌కు చేరినట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌జీఎఫ్ కార్యదర్శి పాపిరెడ్డి, ఎస్‌జీఎఫ్ పరిశీలకుడు డాక్టర్ రామన్, హన్మంతు, ఎస్‌జీఫ్ సెక్రటరీ సుధీర్‌కుమార్ రెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయులు సురేందర్ రెడ్డి, తిరుపతి, వెంకటన్న, శ్రీనివాసులు, నిరంజన్ గౌడ్, అనిల్ కుమార్ ఉన్నారు.

35
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...