పుట్టిన ఊరు, చదివిన బడిని మరువద్దు


Sun,November 10, 2019 01:40 AM

బిజినేపల్లి : విద్యార్థిని, విద్యార్థులు తల్లిదండ్రు లు, గురువులను గౌరవించాలని సెక్రెటరీ ఆఫ్ టీ డబ్ల్యూఆర్‌ఐఈఎస్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ అ న్నారు. శనివారం మండలంలోని వట్టెం గ్రామంలోని జవహార్ నవోదయ విద్యాలయంలో జరిగిన రజతోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... పుట్టిన ఊరు, చదివిన విద్యా సంస్థలను జీవితాం తం గుర్తు పెట్టుకోవాలన్నారు. సమాజ సేవలో విద్యార్థులు పాలు పంచుకోవాలన్నారు. విద్యార్థులు తమ భవిష్యత్‌ను ఒక ప్రణాళిక బద్దంగా తయారు చేసుకొని తీర్చి దిద్దుకోవాలన్నారు. ప్ర స్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో పోటీ పడి చదవాలన్నారు. ఈ నవోదయ విద్యాలయాల్లో సీటు ల భించి ఇక్కడ చదువుకోవడం అదృష్టంగా భావించాలన్నారు. అనంతరం బల్‌రాం మా ట్లాడుతూ పేదరికంలో పుట్టి గ్రామీణ ప్రాంతాల్లో తెలుగు మీడియంలో చదివి ఇంటర్ తర్వాత దూర విద్య తర్వాత ఉన్నత విద్యను అభ్యసించి ఉత్తమ స్థాయికి చేరడం జరిగిందన్నారు.

ఆల య ధర్మకర్త రంగారెడ్డి మాట్లాడుతూ నాటి ఎంపీ మల్లురవి కృషితో నెలకొల్పిన ఈ నవోదయ వి ద్యాలయం పాతికేళ్ల ప్రయాణంలో విద్యార్థులు అ న్ని రంగాల్లో ప్రశంసించే స్థాయికి ఎదగాలన్నారు. ఏవైరెడ్డి మాట్లాడుతూ ఈ జిల్లాకు చెందిన నేను ఈ ప్రాంతంలో ఉన్న ఈ నవోదయ విద్యాలయ రజతోత్సవాలకు హాజరు కావడం ఎంతో గ ర్వ దాయకం. నవోదయ జీవితం ఖచ్చితంగా బం గారు భవిష్యత్ అన్నారు. డిప్యూటీ కమిషనర్ అ నసూయ మాట్లాడుతూ ఈ నవోదయ విద్యాలయంలో నేను టీచర్‌గా పని చేసి డిప్యూటీ కమిషనర్ స్థాయికి చేరుకున్నానన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అదేవిధంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ వీర రాఘవయ్య, దామోదర్‌రెడ్డి, రిటైర్డ్ డిప్యూటీ కమిషనర్ ఏవైరెడ్డి, ప్రస్తుత డిప్యూటీ కమిషనర్ అనసూయ, ఆలయ చైర్మన్ సందడి రంగారెడ్డి, పూర్వ విద్యార్థుల సం ఘం కన్వీనర్ మురళికృష్ణ, కో కన్వీనర్ పరమేశ్, అధ్యక్షులు రంజిత్‌కుమార్, పూర్వ విద్యార్థులు శశాంక్, ప్రవీణ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...