విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలి


Sun,November 10, 2019 01:40 AM

పెద్దకొత్తపల్లి : విద్యార్థులు విద్యతోపాటు క్రీడల్లోనూ రాణించి రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో ఎంపిక కావాలని ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని జె డ్పీహెచ్‌ఎస్ పాఠశాల ఆవరణలో ఉమ్మడి జిల్లా ఎస్‌జీఎఫ్ 65వ ఖోఖో పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో గెలుపొందిన అండర్-17 బాలికల విభాగం మొదటి విజేత నారాయణపేట, ద్వితీయ విజేత వనపర్తి, అండర్-17 బాలుర విభాగంలో మొదటి విజేత నాగర్‌కర్నూల్, ద్వితీయ విజేత మహబూబ్‌నగర్ నిలిచాయి. అదే విధంగా ఉ మ్మడి పోటీల్లో రాష్ట్ర స్థాయి పోటీలకు బాలికలు 15 మంది బాలురు 14 మంది ఎంపికైనట్లు ప్రధానోపాద్యాయులు అశోక్‌రెడ్డి తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే హర్షవర్దన్‌రెడ్డి క్రీడాకారులకు బహుమతులు అందజేశారు. మార్కెట్ చైర్మన్ నరేందర్ రెడ్డి, జెడ్పీటీసీ గౌరమ్మ, సర్పంచ్ వెంకటేశ్వర్‌రెడ్డి, ఎంపీటీసీ రేణుకానాగరా జు, ఎంపీటీసీ శశికళ, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాసులు, నాయకులు రాజశేఖర్, నాగరాజు, వెంకటయ్య, చంద్రయ్య, కొండల్‌రావ్ ఉన్నారు.

30
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles