రోడ్డు ప్రమాదంలో తొమ్మిదో తరగతి విద్యార్థి మృతి


Thu,November 7, 2019 01:40 AM

పదర : మండల పరిషత్ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి ఇంగ్లిష్ మీడియం చదువుతున్న విద్యార్థి కొయ్యల శివ (14) రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. పదర మండల కేంద్రానికి చెందిన పత్తి వ్యాపారి వెంకటేశ్వర్లుకు ఉన్న డీసీఎం క్లీనరుగా మంగళవారం రాత్రి వెళ్లాడని గ్రామస్తులు తెలిపారు. అయితే తెల్లవారుజామున మంచు కారణంగా డీసీఎం లారీ ఢీకొనడంతో శివ అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని విచారించారు. అనంతరం కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మాచర్ల ప్రభుత్వ దవాఖానకు తరిలించనున్నట్లు తెలిపారు. ఈ సంఘటనపై మండల కేంద్రంలోని నాయకులు శివ చదువుతున్న పాఠ శాలలకు వెళ్లి మౌనం పాటించి స్వచ్ఛదంగా బంద్‌కు పిలుపునిచ్చారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పత్తి వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని, విద్యార్థి కుంటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.

65
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...