ఖిల్లాలో చోరీ


Thu,November 7, 2019 01:40 AM

- 4 తులాల బంగారం, రూ.5 వేల నగదు అపహరణ
ఖిల్లాఘణపురం : మండల కేంద్రానికి చెందిన రంగన మోని బాలయ్య ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించి నాలుగు తులాల బం గారం, రూ.5 వేల నగదును అపహరించుకు వెళ్లారు. ఈ సంఘటన మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఎస్సై రామస్వామి తెలిపిన వివరాల మేరకు... మంగళవారం రాత్రి బాల య్య ఇంట్లో నిద్రిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి సమయంలో ఇంట్లోకి చొరబడి బీరువాలో ఉన్న రూ.5 వేల నగదుతో పాటు 4 తులాల బంగారును అపహరించుకొని వెళ్లిపోయారని ఎస్సై తెలిపారు. బాధితుడు ఇచ్చిన సమాచారం మేరకు క్లూస్ టీమ్‌తో ఎస్సై అక్కడికి చేరుకొని సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

33
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...