మంత్రికి స్వాగతం


Thu,November 7, 2019 01:39 AM

పెబ్బేరు రూరల్ /కొత్తకోట/ మదనాపురం : విదేశీ పర్యటన ము గించుకొని బుధవారం ఉదయం హైదరాబాద్‌కు చేరుకున్న రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డికి పెబ్బేరు, శ్రీరంగాపురం మండలాలకు చెందిన టీఆర్‌ఎస్ నాయకులు విమానాశ్రయంలో స్వాగతం పలికారు. పెబ్బేరు టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు వనంరాములు, మాజీ జెడ్పీటీసీ కర్రెస్వామి, నాయకులు గోవిందునాయుడు, కురుమూర్తి, పెద్దింటి వెంకటేశ్, సాయినాథ్, వెంకటేశ్, గోవింద్, శ్రీరంగాపురం మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు గౌడానాయక్, నాయకుడు జలీల్ మంత్రిని పుష్పగుచ్ఛాలు, శాలువాలతో మంత్రిని సత్కరించారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాల అధికార ప్రతినిది గాడిల ప్రశాంత్, కృష్ణయ్య, హనుమంతుయాదవ్, శంకర్, మదనాపురం మండల టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు వడ్డెరాములు, కురుమూర్తి పాలక మండలి సభ్యులు గోపిస్వామి, రై.స.స. మండల కో-ఆర్డినేటర్ హనుమాన్‌రావు, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు కురుమూర్తి, సీనియర్ నాయకులు మహేశ్ పాల్గొన్నారు.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...