క్రీడా స్ఫూర్తితో రాణించాలి


Thu,November 7, 2019 01:39 AM

వనపర్తి క్రీడలు : క్రీడాకారులు క్రీడాస్ఫూర్తితో క్రీడల్లో రాణించాలని జిల్లా యువజన క్రీడల శాఖ ఇన్‌చార్జి అధికారి అనిల్‌కుమార్ అన్నారు. బుధవారం బాలకిష్టయ్య క్రీడామైదానంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా సెక్రటరీ సుధీర్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉమ్మడి పాలమూరు జిల్లాల ఫుట్‌బాల్ పోటీలలో ఆయా జిల్లాల క్రీడాకారులకు ఎంపికలు నిర్వహించారు. ఈ ఎంపికలను వనపర్తి, నాగర్‌కర్నూల్, గద్వాల్, మహబూబ్‌నగర్ జిల్లాల క్రీడాకారులను డీవైఎస్‌వో అనిల్‌కుమార్ పరిచయం చేసుకుని ప్రారంభించారు. ఈ పోటీలలో నాలుగు జిల్లాలకు చెందిన పుట్‌బాల్ క్రీడాకారుల జట్లు తలపడగా, వనపర్తి జట్టు మొదటి స్థానం, గద్వాల జట్టు ద్వితీయ స్థానం కైవసం చేసుకుంది.

ఈ జట్లలో పాల్గొని మంచి ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను రాష్ట్ర స్థాయి పోటీలకు ఉమ్మడి జిల్లాల నుంచి 18 మందిని ఎంపిక చేసినట్లు ఎస్జీఎఫ్ జిల్లా సెక్రటరీ తెలిపారు. ఈ సందర్భంగా డీవైఎస్‌వో మాట్లాడుతూ ప్రతి క్రీడాకారుడు క్రీడలను క్రీడా స్ఫూర్తితో ముందుకు రాణించాలని సూచించారు. సమాజంలో అన్ని రంగాల్లోను క్రీడా రంగంల్లో చాలా మంది ఉన్నత స్థాయిలో రాణిస్తున్నారని ఆయన పేర్కోన్నారు. ఈ నెల 9వ తేదీ నుంచి వరంగల్‌లో జరగనున్న రాష్ట్ర స్థాయి పుట్‌బాల్ టోర్నీకి ఎంపికైన క్రీడాకారులను పంపించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో పీడీలు సురేందర్‌రెడ్డి, శ్రీనివాసులు, శ్రీనివాస్‌రెడ్డి, బోలమోని కుమార్, నందిమల్ల తిరుపతి, రాజేందర్, వెంకట్, శేఖర్ బాబు, రామన్‌గౌడ్, భానుకిరణ్, రామకృష్ణ, సత్యం వివిధ జిల్లాల పీఈటీలు పాల్గొన్నారు.

20
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...