నిందితుడిని కఠినంగా శిక్షించాలి


Mon,November 4, 2019 11:50 PM

-అధికారులు తప్పు చేస్తే పైవారికి తెలపాలి
-హత్య చేసే అధికారం ఎక్కడిది..?
-వనపర్తి రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున్
-జిల్లా కేంద్రంలో కొవ్వొత్తుల ర్యాలీ

వనపర్తి విద్యావిభాగం : తాసిల్దార్ విజయారెడ్డి హత్యకు కారణమైన నిందితుడిని కఠినంగా శిక్షించాలని వనపర్తి రెవెన్యూ ఉద్యోగు ల సంఘం జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున్ కో రారు. తాసిల్దార్ హత్యను నిరసిస్తూ వనపర్తి జిల్లా రెవెన్యూ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యం లో జిల్లా కేంద్రంలో సోమవారం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లికార్జున్ మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ తాసిల్దార్ విజయారెడ్డిపై ఆమె ఛాంబర్‌లోనే పెట్రోల్ పోసి నిప్పంటించి అతి కిరాతకంగా హత్య చేసిన సురేశ్‌ను శిక్షించాలన్నారు. ప్రభుత్వ అధికారులు తప్పు చేస్తే పై అధికారులకు ఫిర్యాదులు చేయాలే కానీ చం పే అధికారం ఎక్కడిదని ప్రశ్నించారు. తీవ్ర నేరంగా పరిగణించి నిందితుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆర్డీవో కార్యాల యం నుంచి రాజీవ్ చౌరస్తా వరకు కొవ్వొత్తు ల ర్యాలీ నిర్వహించి ఆమె ఆత్మకు శాంతి జరగాలని శ్రద్ధాంజలి ఘటించారు. కార్యక్రమం లో వీఆర్‌వో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు శరబంద, తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల సం ఘం అధ్యక్షుడు మధుకర్, రెవెన్యూ ఉద్యోగు లు యుగంధర్‌రెడ్డి, ఉపాధ్యాయ సంఘం నే తలు గద్వాల కృష్ణ, శ్రీనివాస్‌గౌడ్, యోసేపు తదితరులు పాల్గొన్నారు.

63
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...