అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి


Mon,November 4, 2019 11:48 PM

కొల్లాపూర్‌టౌన్: కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ది పనులను వేగవంతం చేయాలని టీఆర్‌ఎస్ నాయకులు సిద్దేది నర్సింహారావు కోరారు. స్థానిక ఆర్డీవో కార్యాలయం నుండి వయా బస్టాండ్ గాంధీ చౌరస్తాల మీదుగా రోడ్డుకు ఇరువైపులా అదునాతనంగా టైల్స్‌తో నిర్మిస్తున్న పుట్‌పాత్ నిర్మాణ పనులను నర్సింహరావ్ నేతృత్వంలోని టీఆర్‌ఎస్‌బృందం పరిశీలించింది. రాష్ట్ర మంత్రిగా జూపల్లికృష్ణారావు ఉన్న సందర్భంలో ప్రత్యేక చొరవ తీసుకుని 3కోట్ల నిధులు మంజూరు చేయడం ద్వారా ప్రధాన రహదారి, ఇతర పనులు పూర్తి కావడంతో పాటు డివైడర్, సెంటర్ లైటింగ్ ఏర్పాటు చేసి, డివైడర్‌పై చెట్లపెంపకాన్ని చేపట్టి ప్రధాన రహదారిని సుందరవనంగా తీర్చిదిద్దడం జరిగిందన్నారు. ఆయనతోపాటు టీఆర్‌ఎస్ నాయకులు కృషమనాయుడు, ఇక్బాల్, మేకల రాముడు, శేఖర్, సత్యం, అంజి, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

63
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...