అక్రమార్కులను వదిలిపెట్టం


Mon,November 4, 2019 11:48 PM

మదనాపురం : పేదలకు అందిస్తున్న రేషన్ బియ్యా న్ని కొందరు అక్రమార్కులు పక్కదారి పట్టిస్తున్నారని, వీరికి జిల్లా అధికారి అండ దండలు మెండుగా ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అలాంటి వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టమని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, తెలంగాణ రాష్ట్ర సభ్యురాలు శోభనాదేవి తెలిపారు. సోమవారం మండల కేంద్రంలోని ఎఫ్‌సీఐ గోదాం, పోలీస్‌స్టేషన్ ఆవరణలో ఉన్న బియ్యం డీసీఎం వాహనాన్ని ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీస్‌స్టేషన్‌లో ఆమె విలేకరులతో మాట్లాడారు. రెండు, మూడు రోజులుగా వివిధ పత్రికల్లో రేషన్ బియ్యం పట్టివేత అనే కథనాలను చూసి పరిస్థితులను పరిశీలించడానికి వచ్చామని తెలిపారు. అక్రమ రేషన్ బియ్యం పట్టివేతపై సివిల్ సైప్లె జిల్లా అధికారి రేణుకాదేవిని వివరణ కోరగా పొంతనలేని సమాధానాలు చెప్తున్నారన్నారు. ఈ విషయాన్ని కమిటీ సభ్యుల దృష్టికి తీసుకెళ్లగా సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామన్నారు. పోలీసులు తమ విధులు సక్రమంగా నిర్వహిస్తున్నా, సివిల్ సైప్లె అధికారి మాత్రం నిమ్మకు నీరెత్తనట్టుగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. అక్రమ రేషన్ బియ్యాన్ని పట్టుకున్న ఎస్సై సైదయ్య, పోలీస్ సిబ్బందిని అభినందించారు. కార్యక్రమంలో ఫుడ్ కార్పొరేషన్ సభ్యులు ప్రేమ్‌కుమార్, ఎస్సై సైదయ్య, హెడ్ కానిస్టేబుల్ చంద్రమోహన్, కానిస్టేబుళ్లు శ్రీనివాస్, బాలరాజు, జైల్‌సింగ్, రైటర్ ఖాజా తదితరులు పాల్గొన్నారు.

32
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...