ముందస్తు జాగ్రత్తలు తీసుకోండి


Mon,November 4, 2019 11:48 PM

వనపర్తి క్రీడలు : ప్రజలు మలేరియా, డెంగీ వంటి వ్యాధుల బారినపడకుండా ముందస్తు గా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ శ్వేతామొహంతి వైద్య, ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం తన ఛాంబర్‌లో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి, ప్రోగ్రాం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సం దర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మలేరియా, డెంగీ వ్యాదులు రాకుండా మలాథియాన్, ఫైరాత్రియం స్ప్రే చేయించాలన్నారు. ప్రతి మండలానికి 2 ఫాగింగ్ యంత్రాలను పంపాలని, యాంటీ లార్వా సర్వే నిర్వహించాలని తెలిపారు. పీహెచ్‌సీల వారీగా సూపర్‌వైజర్ల కార్యక్రమాలపై నివేదిక సమర్పించాలని చెప్పారు. సర్వేలో ఏఎన్‌ఎంలను భాగస్వాములను చేయాలని ఆదేశించారు. కేసీఆర్ కిట్‌లను సమీక్షిస్తూ ప్రసవం కష్టమయ్యే కాన్పుల సంఖ్య, గత నెల ప్రణాళిక ప్రకారం కాన్పులు నిర్వహించిన సంఖ్య తదితర అంశాలపై అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో డీఎంహెచ్‌వో డాక్టర్ శ్రీనివాసులు, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ శంకర్, ప్రోగ్రాం అధికారి డాక్టర్ రవిశంకర్, డాక్టర్ ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు.

24
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...