పట్టణ ప్రగతికి రూ.15 వేల చెక్కు అందజేత


Mon,November 4, 2019 11:48 PM

వనపర్తి విద్యావిభాగం : జిల్లా కేంద్రంలోని 23వ వార్డులో పట్టణ ప్రగతిలో భాగంగా చేపడుతున్న పారిశుధ్య పనులకు రూ.15 వేల చెక్కును అనూస్ స్కూల్ కరస్పాండెంట్ అనుజ్ఞరెడ్డి కలెక్టర్ శ్వేతామొహంతికి అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వార్డుల పరిశుభ్రతకు దాతలు ముందుకు వచ్చి సాయం అందిస్తే పెద్ద ఎత్తున పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టవచ్చని అన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ లోకనాథ్‌రెడ్డి, ప్రత్యేక అధికారి యుగంధర్, కౌన్సిలర్ వాకిటి శ్రీధర్, ప్రేమ్‌నాథ్‌రెడ్డి, డాక్టర్ మురళీధర్ తదితరులు ఉన్నారు.

35
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...