పట్టణ ప్రణాళికపై మంత్రి ఆరా


Mon,November 4, 2019 11:48 PM

వనపర్తి విద్యావిభాగం : వనపర్తి మున్సిపాలిటీలో జరుగుతున్న పట్టణ ప్రణాళిక అ మలు తీరుపై విదేశాల్లో ఉన్న వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి మాజీ కౌన్సిలర్ వాకిటి శ్రీధర్‌తో ఫొన్‌లో అడిగి తెలుసుకున్నారు. పట్టణంలో జరుగుతున్న పరిశుభ్రత పనులు, ప్రజల భాగస్వామ్యం, అధికారుల చొరవ, ప్రజారోగ్య మెరుగుదల కోసం చేపడుతున్న చర్యలు, పట్టణ ప్రణాళికపై ప్రజల నుంచి వస్తున్న స్పందన తదితర విషయాలను తెలుసుకున్నారు. కొన్నేళ్లుగా అపరిష్కృతంగా ఉన్న రామా టాకీస్ డ్రైనేజీతో పాటు జంగిడిపురం, వేంకటేశ్వర దేవాలయం దగ్గర ఉన్న డ్రైనేజీలు పరిశు భ్రం అవ్వడంతో పాటు ప్రతి కాలనీలో చెత్తచెదాదాన్ని ఎప్పటికప్పుడు తొలగిస్తున్నట్లు చెప్పారు. ప్రజల భాగస్వామ్యంతో ముందుకు వెళ్తున్నామని మంత్రికి వివరించారు.

32
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...