సమస్యల పరిష్కారంపై దృష్టి సారించండి


Mon,November 4, 2019 11:47 PM

-ప్రజావాణిలో కలెక్టర్ శ్వేతామొహంతి
వనపర్తి క్రీడలు : ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సా రించాలని కలెక్టర్ శ్వేతామొహంతి అ ధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజవాణికి జిల్లా వ్యాప్తంగా ప్రజల నుంచి 70 ఫిర్యాదులు వచ్చాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఆయా ప్రాంతాల్లో ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వచ్చిన ప్రతి ఆర్జీదారుడి సమస్య పరిష్కారానికి చొరవ చూపాలన్నారు. సమస్యను పరిష్కారించడంలో జాప్యం చేస్తే ఆర్జీదారు కార్యాలయాల చుట్టూ తిరిగాల్సి వస్తోందన్నారు. సంబంధిత అధికారులు అలా జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులున్నారు.

పోలీస్ ప్రజావాణికి 12 ఫిర్యాదులు..
వనపర్తి టౌన్ : వనపర్తి పోలీస్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణికి 12 ఫిర్యాదులు వచ్చినట్లు డీఎస్పీ కిరణ్‌కుమార్ తెలిపారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తమ సమస్యల తక్షణ పరిష్కారం కోసం ప్రజావాణికి వచ్చారన్నారు. 10 భూతగాదాల ఫిర్యాదులు, 2 భార్య భర్తల ఫిర్యాదులు వచ్చాయని డీఎస్పీ తెలిపా రు. ఫిర్యాదుల సత్వరమే పరిష్కరించాలని పోలీస్ సిబ్బందిని ఆదేశించారు.

31
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...