ప్రణాళిక పనులను వేగవంతం చేయాలి


Mon,November 4, 2019 02:25 AM

వనపర్తి, నమస్తే తెలంగాణ : మున్సిపాలిటీలలో నిర్వహిస్తున్న 15 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా మిగిలిన రోజులో శ్రమదానం, హరితహార కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని కలెక్టర్ శ్వేతామొహంతి సూచించారు. మున్సిపాలిటీలో నిర్వహిస్తున్న 15 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమాన్ని ఆదివారం ఆమె పట్టణంలోని 5వ, 6వ వార్డులలో నాయకులు, ప్రత్యేక అధికారులు, మహిళా సంఘాల సభ్యులు నిర్వహిస్తున్న శ్రమదానం పనులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పట్టణ ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు వార్డులలో పేరుకుపోయిన చెత్త, పాత ఇండ్లు, మురుగు కాలువల శుభ్రం, ఖాళీస్థలాలలో పేరుకుపోయిన పిచ్చి మొక్కల తొలగింపు వంటి కార్యక్రమాలను చేయడం జరిగిందని ఆమె తెలిపారు.

జిల్లా కేంద్రంలో శ్రమదానం..
జిల్లా కేంద్రంలోని పాత 26 వార్డులు, విలీన గ్రామాలలో కలెక్టర్ ఆదేశాల మేరకు ఆదివారం నాయకులు, ప్రత్యేకాధికారులు మహిళా సంఘాల సభ్యులతో కలిసి శ్రమదానం కార్యక్రమంతో పాటు మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణంలోని 6వ వార్డులో టీఆర్‌ఎస్ పట్టణ ప్రచార కార్యదర్శి మురళీసాగర్ ఆధ్వర్యంలో వార్డులో శ్రమదానం కార్యక్రమంలో పాల్గొన్న అధికారులకు, మహిళా సంఘాల సభ్యులకు, వార్డు ప్రజలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రజినీకాంత్‌రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ రమేశ్‌గౌడ్, మాజీ కౌన్సిలర్లు గట్టుయాదవ్, వాకిటి శ్రీధర్, తిరుమల్, రమేశ్‌నాయక్, ప్రమీలమ్మ, కమలమ్మ, రమేశ్, కృష్ణయ్య, భువనేశ్వరి, ఇందిరమ్మ, సుజాత, ఖైరూన్, పార్వతమ్మ, లక్ష్మీనారాయణ, పద్మమ్మ, వెంకటేశ్వర్లు, శారద, రమాదేవి, జ్యోతి, విజయచందర్, కృష్ణబాబు, సతీశ్‌యాదవ్, విజయలక్ష్మి, నాయకులు జయానంద్, దేవన్ననాయుడు, రాజు, మురళీసాగర్, సత్యం, గిరి, నాగమ్మ, శివ, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...