జిల్లా వైద్యాధికారులపై చర్యలు తీసుకోవాలి


Mon,November 4, 2019 02:24 AM

వనపర్తి, నమస్తే తెలంగాణ : వనపర్తి జిల్లా లో ప్రైవేట్ దవాఖానలకు కొమ్ము కాస్తున్న జిల్లా వైద్యాధికారులపై చర్యలు తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యుగంధర్‌గౌడ్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని బీసీ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో అనుమతులు లేని క్లినిక్‌లు, దవాఖానలు సీజ్ చేసిన తర్వాత కొందరు సిబ్బంది వారి వద్ద నుంచి మాముళ్లు వసూలు చేయడం జరిగిందని, ఈ విషయాన్ని బయటకు రాకుండా చేస్తున్నారని ఆరోపించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారుల తీరుపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, హెల్త్ ప్రిన్సిపాల్ సెక్రటరీ ఇతర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తున్నామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు స్వామిసాగర్, బాలరాజు, అంజన్న యాదవ్, సురేశ్, కరుణాకర్, రవినాయుడు, శివ, పవన్, వినోద్, భాస్కర్‌గౌడ్ ఉన్నారు.

32
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...