విధుల్లో చేరితే పోలీస్ శాఖ నుంచి పూర్తి రక్షణ


Mon,November 4, 2019 02:24 AM

వనపర్తి విద్యావిభాగం : ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు విధుల్లో చేరే ఆర్టీసీ ఉద్యోగులకు పోలీస్ శాఖ రక్షణ నుంచి పూర్తిస్థాయి రక్షణ కల్పిస్తుందని ఎస్పీ అపూర్వరావు అన్నారు. ఆదివారం ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం ఈనెల 5వ తేదీలోపు ఆర్టీసీ ఉద్యోగులను విధుల్లో చేరడానికి అవకాశం కల్పించిందని ఈ నేపథ్యంలో జిల్లా పరిధిలో పనిచేస్తున్న ఆర్టీసీ ఉద్యోగులు తిరిగి విధుల్లో చేరడానికి సిద్ధంగా ఉన్నవారికి పోలీస్ శాఖ నుంచి పూర్తి రక్షణ, భద్రత కల్పిస్తామని ఆమె అన్నారు. ఎవ్వరైనా ఉద్దేశ్యపూర్వకంగా విధుల్లో చేరిన వారిపై అడ్డగించిన, బేదిరింపులకు పాల్పడిన వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్‌కు నేరుగా ఫిర్యాదు చేయాలని ఆమె చెప్పారు. పోలీస్ అధికారులకు కూడా నేరుగా ఫోన్ చేయవచ్చని, అందుకు 100 డయల్, వనపర్తి పోలీస్ కంట్రోల్ రూం 0854533331, పోలీస్ వాట్సప్ 6303923208 నంబర్‌కు, వనపర్తి డీఎస్పీ 9440795720 నంబర్లను సంప్రదిస్తే వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...