క్రీడాభివృద్ధికి కృషి చేస్తున్నాం


Mon,November 4, 2019 02:24 AM

మహబూబ్‌నగర్ స్పోర్ట్స్ : క్రీడాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాలా కృషి చేస్తున్నదని రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. జిల్లా స్కూల్‌గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో టీఎన్‌జీవోస్ భవనంలోని ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి అండర్-17 బాల బాలికల ఎస్‌జీఎఫ్ షటిల్ బ్యాట్మింటన్ టోర్నీ రెండో రోజు మంత్రి ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారులకు బంగారు భవిష్యత్తు ఉంటుందని, క్రీడల్లో రాణించాలని పిలుపునిచ్చారు. జిల్లాలో క్రీడాభివృద్ధికి అన్నివిధాలా కృషి చేస్తున్నామని, స్టేడియం ఆధునీకరణతోపాటు ఇండోర్ స్టేడియం నిర్మాణానికి కృషి చేస్తామని తెలిపారు. రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం వేదిక కావడం సంతోషంగా ఉందన్నారు. క్రీడాభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తామని తెలిపారు.

టోర్నీలో బాల బాలికల విభాగంలో విజేతలుగా హైదరా బాద్, రన్నర్‌గా బాలుర విభాగంలో మెదక్, బాలికల విభాగంలో రంగారెడ్డి జట్లు నిలిచాయి. వీరికి ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు కోరమోని వెంకటయ్య, టీఎన్‌జీవోస్ మాజీ అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి, ఎస్‌జీఎఫ్ సెక్రటరీ రాజశేఖర్‌రెడ్డి, రాం కల్యాణిజీ, పేట టీఎస్ జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్‌గౌడ్, హాకీ సంఘం జిల్లా అధ్యక్షుడు గోటూరు శ్రీనివాసులుగౌడ్, వ్యాయామ ఉపాధ్యాయులు నిరంజన్‌రావు, కృష్ణ, వినోద్, ఉమాదేవి, అరుణజ్యోతి, రెఫరిల్ సయ్యద్ భాను, నర్సింహ, రామేశ్వరయ్య, రాంచంద్రుడు పాల్గొన్నారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...