గరుడవాహన సేవ


Mon,November 4, 2019 02:23 AM

చిన్నచింతకుంట : కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఏడో రోజు కురుమూర్తిస్వామి సతీసమేతంగా గరుడవాహన సేవలో దర్శనమిచ్చారు. స్వామి గర్భగుడి ఆవరణలో స్వామి ఉత్సవ విగ్రహాలకు అర్చకులు, భక్తులు, పురప్రముఖులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రధాన ఆలయం నుంచి గరుడవాహనంపై తిరుమండవీధులలో తిప్పుతూ ఆంజనేయస్వామి ఆలయం వరకు ఊరేగించారు. ఉద్దాల ఉత్సవాని పురస్కరించుకుని చిన్నచింతకుంట ఉన్నత పాఠశాల విద్యార్థినులు ఉద్దాల మైదానంలో వేసిన కోలాటం భక్తులను కట్టికపడేసింది. ఈ కార్యక్రమంలో ఈవో శ్రీనివాసులు, నాయకులు సురేందర్‌రెడ్డి, బత్తుల బాలరాజు, ప్రతాప్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి, సత్యనారాయణగౌడ్, మల్లెల బాలరాజు, సునీల్‌శెట్టి, భాస్కర్‌లతోపాటు వేలాదిమంది భక్తులు పాల్గొన్నారు.

25
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...