పదిపై ప్రత్యేక శ్రద్ధ


Sun,November 3, 2019 03:56 AM

-ఉత్తమ ఫలితాలే లక్ష్యంగా కార్యాచరణ
-ఏబీసీ గ్రేడ్‌లుగా విభజించి బోధన
-మాథ్య్స్, ఫిజికల్ సైన్స్‌లపై ప్రత్యేక దృష్టి
-ఇప్పటివరకు 75 శాతం సిలబస్ పూర్తి
-నవంబర్‌లో కంప్లీట్ చేసేందుకు ప్రణాళిక
-జిల్లాలో 7,800 మంది టెన్త్ విద్యార్థులు

వనపర్తి ప్రతినిధి, నమస్తే తెలంగాణ : పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత శాతాన్ని పెంచి జిల్లాను అగ్రస్థానంలో నిలిపే లక్ష్యంతో జిల్లా విద్యాశాఖ ప్రత్యేక కార్యాచరణ తీసుకుంటుంది. అన్ని సబ్జెక్టుల్లో వంద శాతం ఉత్తీర్ణత ను సాధించేలా విద్యార్థులను సన్నద్ధం చేసేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళుతున్నారు. సోమవారం నుంచి ఈ ప్రత్యేక తరగతులను ప్రారంభించాలని జిల్లా విద్యాశాఖ నిర్ణయించింది. ఇప్పటి వరకు 75 శాతం సిలబస్ పూర్తి చేసిన ఉపాధ్యాయులు ఈ నెలాఖరు వరకు మొత్తం పూర్తి చేసేందుకు పూనుకున్నారు. ఈ ఏడాది ఎస్‌ఎస్‌సీలో ఉత్తమ ఫలితాలు రాబట్టాలని జిల్లా విద్యాశాఖ ప్రత్యేక కార్యాచరణ మొ దలు పెట్టింది. వంద శాతం ఉత్తీర్ణత లక్ష్యంగా కలెక్టర్ శ్వేతామొహంతి ఆధ్వర్యంలో విద్యాశాఖాధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు సమన్వయం తో ప్రత్యేక కార్యాచరణ తీసుకుంటున్నారు.

పదిలో మెరుగైన ఫలితాలను సాధించేందుకు విద్యాశాఖ పక్కా ప్రణాళికను రూపొందించింది. విద్యార్థులు అథికంగా మాథ్స్, ఇంగ్లీష్, ఫిజికల్ సైన్స్ సబ్జెక్టుల్లో అధిక శాతం విద్యార్థులు ఇబ్బందులు పడుతుంటారు. గత ఫలితా ల అనుభవాలను బట్టి ఈ సబ్జెక్టుల వారీగాను విద్యార్థులకు ప్రత్యేక తర్పీదును అందిస్తున్నారు. ఇప్పటి వరకు 75 శాతం సిలబస్ పూర్తి కాగా, మిగిలిన 25 శాతాన్ని ఈ నెల చివరి వరకు పూర్తి చేయాలనే లక్ష్యం పెట్టుకున్నారు. ప్రధానంగా ఎస్‌ఎస్‌సీలో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు చదువులో వెనకబడిన విద్యార్థులపై ప్రత్యేకంగా చొరవ తీసుకునే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు
పదో తరగతి పరీక్షల్లో ఈ ఏడాది ఉత్తమ ఫలితాలు సా ధించేందుకుగాను పాఠశాలల్లో ప్రత్యేక తరగతుల నిర్వహణకు శ్రీకారం చుట్టారు. జిల్లాలోని కొన్ని పాఠశాలల్లో అక్టోబర్ మాసంలోనే ప్రత్యేక తరగతులు ప్రార ంభించుకున్నారు. మిగితా అన్ని బడులల్లో సోమవా రం నుంచి ప్రత్యేక తరగతులు షురూ అవుతున్నాయి. ఈ ప్రత్యేక తరగతులను ఉదయం 8:30 గంటల నుం చి 9:30 వరకు, సాయంత్రం 4:45 నుంచి 5:45 వర కు ఒక గంట అదనంగా నిర్వహిస్తున్నారు. ఒక్కొ రోజు ఒక్కొక్క సబ్జెక్టుపై ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ రోజు కో ఉపాధ్యాయుడు ప్రత్యేక బోధనలు చేపడుతున్నా రు. ఇదిలా ఉంటే, పాఠశాలల్లోని పది విద్యార్థులకు క్వాలిటీ ఎస్‌ఎస్‌మెంట్ ప్రోగ్రాం ద్వారా గుర్తించి ఏబీసీ గ్రేడ్‌లను కేటాయిస్తున్నారు. మొదటి దఫా ఈ కార్యక్రమాన్ని పాఠశాలల్లో పూర్తి చేశారు. సీ గ్రేడ్‌లో వచ్చిన విద్యార్థులను బీ గ్రేడ్‌లోకి వచ్చేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని బోధనలు చేస్తారు. సీ గ్రేడ్ విద్యార్థి లేకుండా తరగతి గదిలో అంతా ఏ, బీ గ్రేడ్‌లకు చెందిన విద్యార్థులు ఉండే లక్ష్యంగా ఈ క్వాలిటీ అసెస్‌మెంట్ ప్రో గ్రాంలో మిడిల్ లైన్ టెస్ట్‌ను నిర్వహించి ఉత్తీర్ణతలను పెంచుకునే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. లెక్కలు, ఇంగ్లీష్, ఫిజికల్ సైన్స్ సబ్జెక్టుల వారీగా విద్యార్థులకు ఆయా గ్రేడ్‌ల వారీగా ప్రత్యేక బోధనలను ఉపాధ్యాయులు చేపడుతున్నారు.

పరీక్షలకు 7,800 మంది
ఈ ఏడాది పది పరీక్షలకు 7,800 మంది విద్యార్థులు వివిధ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల ద్వారా హాజరవుతున్నారు. జిల్లాలో మొత్తం 196 ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటి ద్వారా పది పరీక్షలకు విద్యార్థులంతా సన్నద్ధమవుతున్నారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...