నేడు ప్రవేశ పరీక్ష


Sun,November 3, 2019 03:55 AM

వనపర్తి విద్యావిభాగం : జిల్లా కేంద్రంలోని బాలుర, బాలికల ఉన్నత పాఠశాలలో ఎన్‌ఎంఎంఎస్, ఎన్‌టీఎస్‌ఈ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు పరీక్షల విభాగాధిపతి మధుకర్ తెలిపారు. ఎన్‌ఎంఎంఎస్ (నేషనల్ మిన్ కం మెరిట్ స్కాలర్‌షిప్) పరీక్ష ఆదివారం ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ప్రభుత్వ బాలుర పాఠశాలలో 352 మంది విద్యార్థులకు, బాలికల పాఠశాలలో 429 మంది విద్యార్థులకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా ఎన్‌టీఎస్‌ఈ (నేషనల్ టాలెంట్ సెర్చ్ పరీక్ష) పరీక్ష ఉదయం 9:30 గంటల నుంచి 11:30 గంటల వరకు, మధ్యాహ్నం 1.30 గంటల నుంచి 3.30 గంటల వరకు రెండు సెక్షన్‌లుగా జరుగుతాయని ఆయన తెలిపారు. ఈ పరీక్షలు ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల కేంద్రంగా మొత్తం 255 మందిని కేటాయించడం జరిగిందని ఆయన తెలిపారు. సకాలంలో విద్యార్థులు పరీక్షకు హాజరు కావాలని సూచించారు.

33
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...