ఉత్కంఠ భరితంగా వాలీబాల్ టోర్నీ


Sun,November 3, 2019 03:55 AM

మహబూబ్‌నగర్ స్పోర్ట్స్ : జిల్లా పరిషత్ మైదానంలో నిర్వహిస్తున్న మహ్మద్ నయీమొద్దీన్ స్మారక ఆలిండియా ఇన్విటేషన్ వాలీబాల్ టోర్నీ శనివారం ఉత్కంఠ భరితంగా కొనసాగింది. సాయంత్రం జరిగిన మ్యాచ్‌లో ఈఎంఈ జట్టు సెంట్రల్ ఎక్సైజ్ జట్టుపై 3-2 సెట్ల తేడాతో విజయం సాధించింది. ఏవోసీ, ఇన్‌కాం టాక్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగాల్సి ఉండగా వర్షం కారణంగా నిలిచిపోయింది. ఈ మ్యాచ్‌ను ఆదివారం ఉదయం నిర్వహించనున్నారు. రెండో పోటీలను మాజీ మంత్రి డీకే అరుణ, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, వాలీబాల్ సంఘం జిల్లా అధ్యక్షుడు శాంతికుమార్‌లు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడల్లో గెలుపోటములు సహజమని, క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని చాటాలని సూచించారు. కార్యక్రమంలో వాలీబాల్ సం ఘం ప్రధాన కార్యదర్శి హనీఫ్, ప్రతినిధులు చెన్నవీరయ్య, బషీరొద్దీన్, విద్యాధర్, ముస్తఫా తదితరులు పాల్గొన్నారు.

26
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...