రసవత్తరంగా టోర్నీ..


Sun,November 3, 2019 03:55 AM

రాష్ట్ర స్థాయి షటిల్ బ్యాట్మింటన్ టోర్నీ రసవత్తరం గా కొనసాగింది. జిల్లా క్లబ్ ఇం డోర్ స్టేడియంలో బాలురకు, టీఎన్‌జీవో ఇండోర్ స్టేడియంలో బాలికలకు మ్యాచ్‌లు నిర్వహించారు. జిల్లా క్లబ్ ఇండోర్ స్టేడియం లో జరిగిన బాలుర మ్యాచ్‌లో మెదక్ జ ట్టు ఖమ్మంపై 21-10, రంగారెడ్డి జట్టు మహబూబ్‌నగర్‌పై 21-3 పాయింట్ల తేడాతో విజయం సాధించింది. టీఎన్‌జీవో ఇండోర్ స్టేడియంలో జరిగిన బాలికల విభాగం మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు ఖమ్మంపై 2-0, ఖమ్మం జట్టు వరంగల్‌పై 2-0, వరంగల్ జట్టు అదిలాబాద్‌పై 2-0, మహబూబ్‌నగర్ జట్టు ఆదిలాబాద్‌పై 2-0, మరో మ్యాచ్‌లో మహబూబ్‌నగర్ జట్టు వరంగల్‌పై 2-0 స్కోర్ తేడాతో విజయం సాధించాయి. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు వెంకటయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆంజనేయులు, ఎస్‌జీఎఫ్ సెక్రటరీలు రాజశేఖర్‌రెడ్డి, పాపిరెడ్డి, పేట టీఎస్ అ ధ్యక్ష, కార్యదర్శులు జగన్మోహన్‌గౌడ్, రాజవర్దన్‌రెడ్డి, హాకీ సంఘం ప్రతినిధులు నిరంజన్, శ్రీనివాసులుగౌడ్, నిరంజన్‌రావు, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

33
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...