ఉత్సాహంగా షటిల్ బ్యాడ్మింటన్ టోర్నీ


Sun,November 3, 2019 03:55 AM

-రాష్ట్రస్థాయి పోటీలకు హాజరైన 100 మంది క్రీడాకారులు
మహబూబ్‌నగర్ స్పోర్ట్స్ : జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో శనివారం జి ల్లా కేంద్రంలోని టీఎన్‌జీవో భవనం ఇండోర్ స్టేడియంలో రాష్ట్ర స్థాయి అండర్-17 బాలబాలికల షటిల్ బ్యాడ్మింటన్ టోర్నీ ఉత్సాహంగా ప్రారంభమైంది. టోర్నీకి తెలంగాణ పది జిల్లాల నుంచి 100 మంది క్రీడాకారులు హాజరయ్యారు. ఈ పోటీలను గ్రం థాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని సూచించారు. మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రతిభ గల క్రీడాకారులకు కొదవ లేదని, ఎంతో మంది రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణిస్తున్నారని గుర్తు చేశారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అనేక రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు జిల్లా కేంద్రం వేదిక కావడం సంతోషంగా ఉందన్నా రు. క్రీడల్లో గెలుపోటములు సహజమని, క్రీడాకారులు క్రీడాస్ఫూర్తిని చాటాలని సూ చించారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి అన్నివిధాలా కృషి చేస్తున్నదని తెలిపారు.

29
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...