రూ.5.88 కోట్లు


Sat,November 2, 2019 01:27 AM

-తొలిరోజు మద్యం అమ్మకాలు
-భారీగా తరలొచ్చిన వైన్స్ షాపుల యజమానులు
తిమ్మాజిపేట : నూతన మద్యం దుకాణాలు శుక్రవారం నుంచి ప్రారంభం కావడం తో యజమానులు మద్యం కోసం నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలకేంద్రంలోని టీఎస్‌బీసీఎల్ స్టాక్ పాయింట్‌కు భారీగా తరలివచ్చారు. నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు చెందిన 117 మద్యం దుకాణాదారులకు తిమ్మాజిపేట స్టాక్‌పాయింట్‌ను కేటాయించారు. మహబుబ్‌నగర్ ఉమ్మడి జిల్లాలో తిమ్మాజిపేట ఒక్కటే స్టాక్ పాయింట్ ఉండగా, జిల్లాల విభజన అనంతరం గతేడాది కొత్తకోట వద్ద మరో స్టాక్ పాయింట్‌ను ఏర్పాటు చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా నుం చి 50, నాగర్‌కర్నూల్ నుంచి 38, రంగారెడ్డి పరిధిలోని షాద్‌నగర్ నుంచి 25, వికారాబాద్ నుంచి 4 దుకాణాలను తిమ్మాజిపేట స్టాక్‌పాయింట్‌కు కేటాయించారు.

మొదరోజు 102 దుకాణాల యజమానులు మద్యం కోసం రాగా రూ.5.88 అమ్మకాలు జరిగినట్లు స్టాక్ పాయింట్ నిర్వహకులు తెలిపారు. అయితే, కొందరు సకాలంలో డీడీలు తీయకపోవడంతో మద్యం కొనుగోలు చేయలేదు. మద్యం కోసం పురుషులతో పాటు, మహిళలు కూడా వచ్చారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో కల్వకుర్తి, చారగొండ, అ చ్చంపేటలలో మహిళలకు దుకాణాలు రావడంతో వారు మొదటి రోజు నిబంధనలు పూర్తి చేసేందుకు స్టాక్ పాయింట్‌కు చేరుకున్నారు. తొలిరోజు రేషన్ పద్ధతిలో మద్యం అందించారు. అన్ని దుకాణాలకు మద్యం అందించాలన్న అధికారుల ఆదేశాల మేరకు ఒక్కో దుకాణానికి 100 కాటన్ల లిక్కరు, 200 కాటన్ల బీర్లు ఇచ్చినట్లు డీఎం తిరుపతిరెడ్డి తెలిపారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి మొదట మద్యం ఇస్తున్నట్లు చెప్పా రు. తొలిరోజు కావడంతో స్టాక్ పాయింట్ కిక్కిరిసిపోయింది. వాహనాలు బారులు తీరాయి. సాయంత్రం వరకు మద్యం అమ్మకాలు కొనసాగాయి. మద్యం కంపెనీలు స్టాల్స్ ఏర్పాటు చేశారు.54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...