విద్యార్థుల సామర్థ్యాలను వెలికితీయాలి


Sat,November 2, 2019 01:27 AM

-డీఈవో సుశీందర్‌రావు
పెద్దమందడి : విద్యార్థుల సామర్థ్యాలకనుగుణంగా పాఠ్యాంశాలను బోధించాలని డీఈవో సుశీందర్‌రావు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఎమ్మా ర్సీ భవనంలో ఏర్పాటు చేసిన స్కూల్ కాంప్లెక్స్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నవంబర్ 4 నుంచి జిల్లా వ్యాప్తంగా ప్రతి పాఠశాలలో రెండో విడత ఏబీ సీ ప్రోగ్రాంను నిర్వహించనున్నామని, ప్రతి సబ్జెక్టులో ఏ విద్యార్థి ఏఏ సామర్థ్యాలలో వెనుకబడి ఉన్నాడో గుర్తించాలన్నారు. వారిని గ్రూపులుగా విభజించి మంచి బోధన చేయాలని సూచించారు. ప్రతి ఉపాధ్యాయుడు వందశాతం ఫలితాలను టార్గెట్ పెట్టుకోవాలన్నారు. అనంతరం 3వ తరగతి విద్యార్థులను ఎక్కాలు అడుగగా విద్యార్థులు 15 నుంచి 20 ఎక్కాల వరకు చెప్పడంతో వారిని అభినందించారు. సమావేశంలో ఎంఈవో జయశంకర్, జీహెచ్‌ఎం ఉమాదేవి, ఉపాధ్యాయులు తదితరులున్నారు.

29
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...