భిక్షాటన చేసిన ఆర్టీసీ కార్మికులు


Sat,November 2, 2019 01:27 AM

వననర్తి విద్యావిభాగం : ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని చేపడుతున్న సమ్మె శుక్రవారం 28వ రో జుకు చేరింది. ముం దుగా దీక్ష శిబిరం నుంచి ర్యాలీ చేపట్టి దుకాణ సముదాయాలలో కార్మికులు భిక్షాటన చేపట్టారు. ఈ సందర్భంగా ఆర్టీసీ జేఏసీ నాయకులు మాట్లాడుతూ గత మాసం పనిచేసిన దినాలకు వేతనాలు లేవని, సమ్మె కాలం కూడా వేతనాలు లేక చాలా ఇబ్బందుల్లో ఉన్నామని అన్నారు. ఆర్టీసీని పరిరక్షించుకునేందుకే సమ్మెలోకి వెళ్లామని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడి ప్రజా రవాణా వ్యవస్థ మెరుగు కోసమే సమ్మె చేపడుతున్నామని తెలిపారు. తక్షణమే ప్రభుత్వం చర్చలకు పిలిచి సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ జేఏసీ నాయకులు గోపిగౌడ్, విశ్వనాథం, జేవీ స్వామి, ఆయా పార్టీల నాయకులు అయ్యంగారి ప్రభాకర్‌రెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి, ఎండీ జబ్బార్, డీ చంద్రయ్య, డీ నారాయణ, కవులు, కళాకారులు ఉన్నారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...