ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరికలు


Sat,November 2, 2019 01:26 AM

ఆత్మకూరు, నమస్తే తెలంగాణ : టీడీపీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్త లు శుక్రవారం టీఆర్‌ఎస్‌లో చేరారు. మున్సిపాలిటీ పరిధిలోని ఖానాపూర్‌కు చెందిన మాజీ ఉపసర్పంచ్ చెన్నయ్య, ముఖ్య నాయకులు రవి, మల్లేశ్ తదితర 30 మంది ముఖ్యులు, కార్యకర్తలు శుక్రవారం టీఆర్‌ఎస్‌లో చేరారు. ఆత్మకూరు మండలకేంద్రంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహం ప్రాంగణంలో ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. ఎమ్మెల్యే వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. ఈ సందర్భంగా చిట్టెం మాట్లాడుతూ మున్సిపాలిటీ ఎన్నికల్లో ఖానాపూర్‌కు తగిన ప్రా ధాన్యత ఉంటుందన్నారు. రానున్న ఎన్నికల్లో పార్టీ గెలుపునకు ప్రతి కార్యకర్త కృషిచేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ శ్రీనివాసులు, పీఏసీఎస్ అధ్యక్షుడు కృష్ణమూర్తి, మాజీ ఎంపీపీ శ్రీధర్‌గౌడ్, పార్టీ అద్యక్షుడు రవికుమార్‌యాదవ్, లీగల్ సెల్ ప్రెసిడెంట్ విజయ్‌భాస్కర్‌రెడ్డి, వీరేశలింగం, గోపాల్‌యాదవ్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...