ఇక వలసలు వాపస్


Fri,November 1, 2019 01:59 AM

-కేటీఆర్ ఆలోచనలకు ప్రతిరూపం ఐటీ పార్క్
-సీఎం కేసీఆర్‌కు జిల్లాపై ప్రత్యేక అభిమానం ఉంది
-పుర ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌దే విజయం
-ఐటీ టవర్ శంకుస్థాపనలో ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
-హాజరైన ఎంపీ, ఎమ్మెల్సీలు, కలెక్టర్
మహబూబ్‌నగర్ ప్రధాన ప్రతినిధి/నమస్తే తెలంగాణ : ఇన్నాళ్లు పాలమూరు ప్రజలు ఉపాధి కోసం పొట్ట చేతపట్టుకుని దుబాయ్, ముంబై, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది.. ఇకపై ఆ పరిస్థితి పూర్తిగా తొలగిపోనుందని ఎక్సైజ్ శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా దివిటిపల్లి సమీపంలో రూ.100 కోట్లతో నిర్మిస్తున్న ఐటీ టవర్ నిర్మాణానికి గురువారం మండలి విప్ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, మహబూబ్‌నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ స్వర్ణ సుధాకర్‌రెడ్డి, టీఎస్‌ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డిలతో కలిసి మంత్రి భూమిపూజ నిర్వహించారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. అన్ని రంగాల్లో సమగ్రాభివృద్ధి చెందుతున్న మహబూబ్‌నగర్‌కే ఇతర ప్రాంతాల నుంచి వలసలు వచ్చే రోజులు ముందున్నాయని చెప్పారు. మంత్రి కేటీఆర్ ఆలోచనలకు ప్రతిరూపమైన ఐటీ పార్క్ నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలిచ్చారని ఆయన వివరించారు. తెలంగాణ వస్తే ఏమొస్తది అంటే ఐటీ పార్కు, మెడికల్ కాలేజ్, మయూరి పార్కు, పాలమూరు ప్రాజెక్టు.. అని గర్వంగా చెప్తున్నామన్నారు. త్వరలోనే ఈ ప్రాంతంలో పెద్ద కాలువలు, రిజర్వాయర్ వస్తాయన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పాలమూరుపై ఉన్న ప్రత్యేక అభిమానం వల్లే ఐటీ పార్క్ ఏర్పాటు అవుతుందన్నారు.

దివిటిపల్లి సమీపంలో జాతీయ రహదారి పక్కనే ఉన్న సర్వే నెంబర్లు 556, 607లలో దాదాపు 475 ఎకరాలలో ఐటీ శాఖ ఆధ్వర్యంలో టీఎస్‌ఐఐసీ ద్వారా ఐటీ, ఇండస్ట్రీయల్ క్లస్టర్, ఐటీ టవర్ల నిర్మాణాలు చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు. హైదరాబాద్ తర్వాత అతి పెద్ద ఐటీ పార్క్ మహబూబ్‌నగర్‌దే అవుతుందని వివరించారు. ఈ ఐటీ పార్క్ అద్భుతాలు సృష్టిస్తుందన్నారు. ఐటీ పార్క్ ఏర్పాటు వల్ల ఈ ప్రాంత నిరుద్యోగులకు చక్కని ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు. అంతర్జాతీయ విమానాశ్రయం నుం చి కేవలం గంట వ్యవధిలోనే ఇక్కడికి చేరుకు నే అవకాశం ఉందని మం త్రి శ్రీనివాస్ గౌడ్ వివరించా రు. రోడ్డు, రైలు, విమాన సౌక ర్యం అందుబాటులో ఉన్నందున ఈ ఐటీ పార్క్‌కు దేశ విదేశాలకు చెందిన కంపెనీలు తరలివచ్చే అవకాశం ఉందన్నారు. ఏడాది కాలం లో ఐటీ టవర్ నిర్మాణం పూ ర్తవుతుందని.. అనంతరం జా తీయ, అంతర్జాతీయ కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టి తమ కంపెనీలను ప్రారంభిస్తాయన్నారు. తక్కువ ధరకు భూములు ఇచ్చి కంపెనీలను ఆహ్వానిస్తామని తెలిపారు. విద్యుత్, ఇంటర్నెట్‌తో పాటు వివిధ అంశా ల్లో ఐటీ కంపెనీలకు ప్రభుత్వం వెన్నుదన్నుగా ని లుస్తుందన్నారు. ఇక్కడ సదుపాయాలు చూసి హైదరాబాద్ నుంచి పెద్ద పెద్ద కంపెనీలు క్యూ కడతాయని తెలిపారు. అభివృద్ధి జరుగుతుంటే కొం దరు ఓర్వలేక మత రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ప్రజల కోసం పనిచేసే సర్కారుకు ప్రజలంతా అండగా ఉన్నారని తెలిపారు. మహబూబ్‌నగర్‌ను అన్ని రంగాల్లో ముందంజలో ఉంచి ముఖ్యమంత్రి చేత శభాష్ అనిపించుకుంటామని మంత్రి తెలిపారు.

అన్ని మున్సిపాలిటీల్లో విజయం మాదే..
గ్రామాలతో పాటు పట్టణాలపైనా ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు మంత్రి తెలిపారు. అందులో భాగంగానే పట్టణ ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. జిల్లా స్థాయి అధికారులు వార్డులకు ప్రత్యేక అధికారులుగా ఉండి పట్టణ అభివృద్ధి చే స్తున్నారన్నారు. హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో టీ ఆర్‌ఎస్ ఘన విజయం సాధించినట్లుగానే రాబో యే మున్సిపల్ ఎన్నికల్లో అన్ని చోట్ల టీఆర్‌ఎస్ ఘన విజయం సాధిస్తుందని స్పష్టం చేశారు.

యువతకు మంచి అవకాశం..
-మండలి విప్ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి
ఐటీ పార్కు ఏర్పాటు వల్ల ఈ ప్రాంత యువతకు చక్కని అవకాశాలు లభిస్తాయని మం డలి విప్ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి అన్నారు. ఇక్కడ విద్యాభ్యాసం పూర్తి చేసుకుని విదేశాలకు వెళ్లి స్థిరపడకుండా స్థానికంగానే తమ విజ్ఞానాన్ని దేశం కోసం వినియోగించాలని యువతకు పిలుపునిచ్చారు. వచ్చే ఏడాది నాటికి ఐటీ టవర్ పూర్తి చేసి ప్రారంభోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఐటీ టవర్ నిర్మాణాన్ని ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందని కూచుకుళ్ల వివరించారు.

రాష్ట్ర ఏర్పాటుతోనే అభివృద్ధి..
-ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి
తెలంగాణ ఏర్పాటుకు ముందు సమై క్య రాష్ట్రంలో తీవ్రమైన అన్యాయానికి గురైనట్లు మహబూబ్‌నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ చేస్తున్న కృషి వల్లే ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి శ్రీనివాస్ గౌడ్ మహబూబ్‌నగర్ అభివృద్ధి కోసం అహర్నిషలు కష్టపడుతున్నారని ఎంపీ కితాబునిచ్చారు. ఐటీ పార్క్ ఏర్పాటుతో మహబూబ్‌నగర్‌కు ప్రత్యేక గుర్తింపు వస్తుందని తెలిపారు. యువత తమ నైపుణ్యాలను పెంచుకుని మంచి ఉద్యోగాలు సాధించాలని సూచించారు.

పాలమూరు పేరు మార్మోగనుంది..
-ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి
ఐటీ పార్క్ ఏర్పాటుతో మహబూబ్‌నగర్ పేరు మార్మోగనుందని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. ఇప్పటికే మెడికల్ కాలేజీ, మయూరి పార్క్, బైపాస్ రోడ్డు నిర్మాణాలతో మహబూబ్ నగర్‌కు ప్రత్యేకంగా గుర్తింపు వచ్చిందన్నారు. త్వరలో ఏర్పాటు కానున్న ఐటీ పార్క్ వల్ల ఈ ప్రాంత యువతకు ఉద్యోగావకాశాలు విస్తృతమవుతాయన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తయితే మహబూబ్ నగర్ మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.

హైదరాబాద్ తర్వాత అతి పెద్ద క్యాంపస్
-టీఎస్‌ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డి
25వేల చ.అ. విస్తీర్ణంలో ఏర్పాటు అవుతున్న మహబూబ్ నగర్ ఐటీ పార్క్ హైదరాబాద్ తర్వాత అతి పెద్దదని టీఎస్‌ఐఐసీ ఎండీ నర్సింహారెడి తెలిపారు. ఈ ఐటీ పార్క్ వల్ల ప్రత్యక్షంగా 50వేల మందికి, పరోక్షంగా 1.50లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని వివరించారు. ఐటీతో పాటు వివిధ తయారీ రంగ సంస్థలు ఇక్కడికి తరలివచ్చే అవకాశం ఉందన్నారు. నిజామాబాద్, కరీంనగర్ తర్వాత ద్వితీయ శ్రేణి పట్టణాల్లో ఏర్పాటు అవుతున్న ఐటీ పార్క్ ఇదేనని తెలిపారు. సమీపంలోనే రైల్వే స్టేషన్, చెంతనే బెంగళూరు హైవే, పక్కనే ప్రభుత్వ మెడికల్ కాలే జీ, ప్రశాంతమైన వాతావరణం.. వంటి చక్కని సదుపాయాలున్నాయన్నారు. ఐటీ కంపెనీలు ఏర్పాటు చేసే వారికి అనేక రాయితీలు కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో కార్పొరేషన్ల చైర్మన్లు బాద్మి శివకుమార్, దేవరి మల్లప్ప, జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రోస్, రవికుమార్, ఇంతియాజ్, కొరమోని వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

97
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...