కార్మికశాఖ మంత్రికి వినతి


Fri,November 1, 2019 01:58 AM

కొత్తకోట : బీడీ కార్మికుల పెండింగ్ పింఛన్లను వెంటనే మంజూరు చేయాలని గురువారం కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డిని జెడ్పీ వైస్ చైర్మన్ వామన్‌గౌడ్ ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్ నాయకులు కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. కులవృత్తులను ప్రోత్సహిస్తూ సీఎం కేసీఆర్ ప్రారంభించిన కులవృత్తుల పింఛన్ పథకం కులవృత్తులకు గొప్ప వరంగా మారిందని, అందులో భాగంగానే కొత్తకోట మున్సిపాలిటీలోని బీడీ కార్మికుల పెండింగ్ పింఛన్లను మంజూరు చేసి వారి జీవనోపాధికి తోడ్పాటును అందించాలని కోరారు. త్వరలోనే పింఛన్లను మంజురు చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాల అధికార ప్రతినిధి ప్రశాంత్, ప్రధాన కార్యదర్శి బాలకృష్ణ, బీడీ కార్మికుల సంఘం ప్రతినిధి అయ్యన్న ఉన్నారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...