27వ రోజుకు చేరిన కార్మికుల దీక్షలు


Fri,November 1, 2019 01:57 AM

వనపర్తి విద్యావిభాగం : ఆర్టీసీ కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని చేపట్టిన సమ్మె గురువారం 27వ రోజుకు చేరింది. గురువారం ఆర్టీసీ కార్మికులు 24 గంటల దీక్ష చేపట్టారు. ముందుగా సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జబ్బార్, సీఐటీయూ కార్యదర్శి పుట్ట ఆంజనేయులు ప్రారంభించారు. ఆంధ్రాలో సీఎం జగన్ ఆర్టీసీ విలీన ప్రక్రియను 6 నెలల్లో పూర్తి చేయ్యనున్నట్లు మంత్రులు వెల్లడించారన్నారు. తెలంగాణలో కూడా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని వారు కోరారు. ఈ దీక్షలో కార్మికులు కురుమయ్య, డీబీకే రెడ్డి, బీకే విశ్వనాథ్, ఎండీ ఖయ్యుం, అశోక్‌కుమార్, శేఖర్‌గౌడ్, ఆర్టీసీ జేఏసీ నాయకులు గోపిగౌడ్, విశ్వనాథం, జేవీ స్వామి, వీవీ మూర్తి, దేవేందర్‌గౌడ్, బీఎస్పీ నాయకులు సత్యంసాగర్, చలపతిరెడ్డి తదితరులున్నారు.

33
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...