శ్మశానవాటికకు దారిలేక ఇబ్బందులు


Fri,November 1, 2019 01:57 AM

పెబ్బేరు రూరల్ (శ్రీరంగాపురం) : శ్రీరంగాపురం మండలం నాగరాలలో శ్మశానవాటిక లేక గ్రామస్తులు నానా తంటాలు ప డుతున్నారు. బుధవారం ఉప్పరి సాయన్న మృతి చెందగా గురువారం అం త్యక్రియలకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. శవాన్ని పంట పొలాల మీదుగా తీసుకెళ్లారు. రంగసముద్రం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కింద నీటి మునకకు గురైన ఈ గ్రామాన్ని కొత్తగా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం మూడు పునరావాస కేంద్రాలను కేటాయించింది. కానీ గ్రామస్తులు అక్కడికి పోలేదు. ప్రస్తుతం పూర్తిగా నిండిపోవడంతో గ్రామం చుట్టూ నీరు చేరింది. శ్మశానవాటిక కూడా మునిగిపోయింది. మూడో పునరావాస కేంద్ర వద్ద శ్మశానవాటికకు శవాలను తరలించాలంటే 16 కి.మీ. చుట్టూ తిరగాల్సిందే. దీంతో గ్రామస్తులు పంట పొలాల మీదుగా శవాలకు అష్టకష్టాలు పడుతూ అంతిమ యాత్ర నిర్వహిస్తున్నారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...