దోమల నివారణపై శాఖాపూర్‌లో అవగాహన


Fri,November 1, 2019 01:56 AM

పెబ్బేరు రూరల్ : పెబ్బేరు మండలం ఏటిగడ్డ శాఖాపూర్ గ్రామంలో గురువారం వైద్య సిబ్బంది దోమల ద్వారా వచ్చే వ్యాధులపై అవగాహన కల్పించారు. గ్రామంలో ఇంటింటికీ తిరిగి నీటి నిల్వ లేకుండా చూసుకోవాలని, పరిసరాలను, వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని గ్రామస్తులకు సూచించారు. దోమకాటుతో డెంగీ, మెదడువాపు, మలేరియా వ్యాధులు సోకే అవకాశముందన్నారు. అందుకే ప్రతి ఒక్కరూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ఇండ్లలో శిథిలమైన నవస్తువులు, టైర్లు, తదితరాలను ఉంచుకోరాదని, పాఠశాలల విద్యార్థులకు కూడా పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ రవికుమార్‌యాదవ్, ప్రత్యేకాధికారి కొండన్న, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...