జూరాలకు భారీగా వరద


Wed,October 23, 2019 02:43 AM

జోగుళాంబ గద్వాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ: జూరాలకు వరద ప్రవా హం భారీగా పెరిగింది. మంగళవారం సాయంత్రం జూరాల ఇన్‌ఫ్లో 2,65,000 క్యూసెక్కులు ఉండగా అవుట్‌ ఫ్లో 2,92,408 క్యూసెక్కులు నమోదైంది. దీంతో ప్రాజెక్ట్‌లోని 28 గేట్లను ఎత్తి 2,61,759 క్యూసెక్కుల నీటిని నదిలోకి విడుదల చేస్తున్నారు. పవర్‌హౌస్‌కు 25,880 క్యూసెక్కుల నీటిని విడుదల చేసి 6 టర్బైన్ల ద్వారా విద్యుదుత్పత్తి చేస్తున్నారు. జూరాల ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 1045 అడుగుల ఎత్తులో 9.657 టీఎంసీలుండగా ప్రస్తుతం 1044.9 అడుగుల ఎత్తులో 9.357 టీఎంసీల నీటిని నిల్వ చేస్తున్నారు. కుడి కాలువ 822 క్యూసెక్కులు, ఎడమ కాలువ 1,000 క్యూసెక్కులు, సమాంతర కాలువ ద్వారా 340క్యూసెక్కులు నీటిని కాలువల్లోకి విడుదల చేస్తున్నారు. వీటితోపాటు నది నుంచి వచ్చే నీటిని రిజర్వాయర్లను నింపేందుకు భీమా లిఫ్ట్‌-1 650, నెట్టెంపాడుకు 1,500, కోయిల్‌సాగర్‌ లిఫ్ట్‌ ద్వారా 315 క్యూసెక్కులు ఎత్తిపోస్తున్నారు. ఆల్మట్టి ప్రాజెక్ట్‌కు ఇన్‌ఫ్లో 1,45,424క్యూసెక్కులు కొనసాగుతుండటంతో 1,56,407 క్యూసెక్కులతో నీటిని నదిలోకి విడుదల చేస్తున్నారు. పూర్తి సామర్థ్యం 129.72టీఎంసీలు ఉండగా 127.1 టీఎంసీలు నిల్వ ఉన్నది. నారాయణఫుర ప్రాజెక్ట్‌ ఇన్‌ఫ్లో 2,30,000, అవుట్‌ఫ్లో 2,57,844 క్యూసెక్కులు నమోదుకావడంతో ప్రాజెక్ట్‌లోని 11 గేట్లను ఎత్తి నదిలోకి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 37.64 టీఎంసీల సామర్థ్యం ఉండగా అదేస్థాయిలో 33.64 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...