16వ రోజు సాఫీగా..


Mon,October 21, 2019 04:47 AM

- 78 ఆర్టీసీ, 17 అద్దె బస్సులు
- బస్టాండ్‌లో కిక్కిరిసిన ప్రయాణికులు
వనపర్తి విద్యావిభాగం : ఆర్టీసీ సమ్మె కారణంగా 16వ రోజు యథావిదిగా ఆర్టీసీ యాజమాన్యం బస్సులను నడిపారు. 78 ఆర్టీసీ బస్సులను, 17 అద్దె బస్సులు నడిచాయి. సోమవారం నుంచి పాఠశాలలు, కళాశాలలు తెరువనుండడంతో సోమవారం నుంచి హైదరాబాద్‌లో చదివే విద్యార్థుల వెంట వెళ్లే తల్లిదండ్రులు బస్టాండ్, డిపోలకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. బస్సులన్నీ నిండుగా ప్రయాణికులతో కిక్కిరిశాయి. దానికనుగుణంగా ఆర్టీసీ యాజమాన్యం డిపోలోని బస్సులన్నింటిని నడిపించారు.

38 గ్రామీణ ప్రాంతాలకు బస్సులు
సమ్మెలో భాగంగా గ్రామీణ సర్వీసులు ఆదివారం పునరుద్ధరించారు. మొత్తం 38 గ్రామాలకు సర్వీసులను నడిపి యథావిదిగా బస్సులు నడుస్తున్నాయని, గ్రామీణ ప్రజలకు, ప్రయాణికులకు భరోసాను ఇచ్చారు. ఎప్పటి మాదిరిగానే గ్రామీణ ప్రాంతాల్లో సర్వీసులు నడుస్తున్నాయని డీఎం దేవదానం తెలిపారు.

డ్రైవర్లకు చెకింగ్
వివిధ రూట్‌లలో ప్రయాణించే బస్సుల ప్రతి డ్రైవర్లకు మద్యం సేవించారని డ్రంక్ ఆండ్ డ్రైవ్ చెక్ చేశాకనే వాహనాన్ని నడిపేలా ఆర్టీవో అధికారులు చర్యలు చేపట్టారు. ప్రతి రూట్‌లలో ఎప్పటి మాదిరిగానే ఎన్ని ట్రిప్పులు తిరగాలో, ఎంత ఆదాయం తీసుకురావాలో డీఎం మార్గనిర్దేశం చేశారు.

రెవెన్యూ సహకార సంఘాల తోడ్పాటు
ఆర్టీసీ సమ్మెలో భాగంగా డిపో కార్యాలయంలో విధులు నిర్వహించే సిబ్బంది లేకపోవంతో రెవె న్యూ, సహకార సంఘం సిబ్బందితో బస్సులు సాఫిగా సాగేలా విధులు నిర్వహిస్తున్నారు. డిపోలో ఆర్టీవో సూచించిన డ్రైవర్, కండక్టర్లకు ప్రయాణికుల రద్దీని బట్టి ఎప్పటికప్పుడు ఆయా రూట్‌లలో వాహనాలు నడిపేలా టిమ్ములు ఇవ్వడం, వాహనాలు సాఫీగా నడిచేలా విధులు నిర్వహిస్తున్నారు. బస్సులు నడిచాక ఉదయం, సాయంత్రం వేళలో నగదును తీసుకునేందుకు సిబ్బంది విధులు చేపడుతున్నారు. వీరిని రెండు విడతలలో పది మందిని అందుబాటులో ఉంచారు.

119
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...