ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు


Mon,October 21, 2019 04:45 AM

పెద్దకొత్తపల్లి : మండల కేంద్రం సమీపంలో కొల్లాపూర్ ఆర్టీసీ డిపోకు చెందిన బస్సులో నుంచి ఒక్కసారిగా పొగలు రావడంతో బస్సులోని ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కొల్లాపూర్ ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు హైదరాబాద్ వెళ్తుండగా పెద్దకొత్తపల్లి సమీపంలో ఒక్కసారిగా ఇంజన్ నుంచి బస్సులో పొగలు రావడం వల్ల అకస్మాత్తుగా బస్సు పొగతో నిండిపోయింది. దీంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. బస్సులో నుంచి కిందకు దిగి పరుగులు పెట్టారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఇంజిన్ లోపల అంగి (షర్టు) బట్ట ఉండటంతో అది కాలి బస్సులోకి పొగ వచ్చిందని ప్రయాణికులు తెలిపారు. ఆర్టీసీ అధికారులు ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా చూడాలని ప్రయాణికులు కోరుతున్నారు.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...