తప్పనిసరిగా హాజరు కావాల్సిందే


Mon,October 21, 2019 04:44 AM

వనపర్తి విద్యావిభాగం : దసరా సెలవుల అనంతరం సోమవారం నుంచి పాఠశాలలు తెరుచుకోనున్నాయని తప్పనిసరిగా గురుకుల విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను సోమవారం పాఠశాలలకు హాజరయ్యేలా చూడాలని మైనార్టీ గురుకుల డీఎల్‌సీ గులాం హుస్సేన్ అన్నారు. ఆదివారం పురుషుల మైనార్టీ గురుకుల పాఠశాలలో ఆయన ఉపాధ్యాయులతో సమావేశం నిర్వ హించారు. పాఠశాలలకు విద్యార్థులు సోమవారమే చేరుకునేలా తగు చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. గురుకుల మైనార్టీ విద్యార్థులకు ఆధునిక సాంకేతికత, టెక్నాలజీ అందించేందుకోసం గురుకుల సంస్థ ఐఐటీతో ఒప్పందం చేసుకుందని, ఐఐటీలో నిపుణులైన వారిచేత శిక్షణ తరగతులు, అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోనున్నట్లు ఆయన వెల్లడిం చారు. మైనార్టీ గురుకుల విద్యార్థుల్లో నైపుణ్యాలను, సమర్థతను పెంచేందుకే ఐఐటీతో ఒప్పందం చేసు కున్నారని ఆయన చెప్పారు. పేద మైనార్టీ విద్యార్థులకు ఇది మహావరమని అన్నారు. గత నెల 28 నుంచి ఈ నెల 14 వరకు ఉండగా ఆర్టీసీ సమ్మెతో అవి 20 వరకు పొడగించబడ్డాయని, దీంతో వారం రోజుల పాటు సిలబస్ వెనుకబడిపోకుండా ఉండేందుకు సాయంత్రం వేళలో తరగతులు నిర్వహించాలని ఆదేశాలు ఆందా యని ఆయన వెల్లడించారు. ఈ సమావేశంలో పాఠశాల ప్రిన్సిపల్ ఫరీదుద్దీన్, ఉపాధ్యాయులు ఉన్నారు.

59
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...