29 అడుగులకు కోయిల్‌సాగర్ నీటిమట్టం


Sun,October 20, 2019 04:45 AM

దేవరకద్ర రూరల్ : పాలమూర్ జిల్లాలోని మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టు కోయిల్‌సాగర్‌లో శనివారం సాయంకాలానికి నీటిమట్టం 29 అడుగులకు చేరిందని ప్రాజెక్టు ఈఈ విజయానంద్ తెలిపారు. గత రెండు నెలలకు పైగా ప్రియదర్శినీ జూరాల ప్రాజెక్టు నుంచి కోయిల్ సాగర్‌కు పంపుమోటర్ల సాయంతో నీటిని తరలిస్తున్నారు. ఆయకట్టు రైతులకు, గొలుసుకట్టు చెరువులకు కుడి, ఎడమ కాల్వల ద్వారా నీటిని విడుదల చేస్తూన్నారు. ఇప్పటికీ నీటి విడుదల కొనసాగుతుండగా, కుడి కాల్వ ఆయకట్టు రైతులు కాల్వకు దగ్గరలో ఉన్న వరి పంటలు తడి ఆరకుండా ఉందని, కొద్దిరోజులు కాల్వ నీటి విడుదల నిలపాలని అధికారులకు తెలుపగా, కుడి కాల్వ నీటి విడుదలను నిలిపి వేసినట్లు తెలిపారు. ఎడమ కాల్వ ద్వారా నీటి విడుదల కొనసాగుతుండగా, శుక్రవారం నాగన్నపల్లి గ్రామ సమీపంలో కాల్వకు గండిపడి నీరంతా వృథాగా వాగులోకి పోతున్న సందర్బంగా, కాల్వ గండిని పూడ్చేందుకు ఎడమ కాల్వ గేట్లను శనివారం మద్యాహ్నం మూసివేసినట్లు తెలిపారు. ప్రస్తుతానికి రెండు కాల్వల నీటి విడుదల ఆపి ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 29 అడుగుల నీటి మట్టం ఉందని, మరొక మూడు అడుగుల నీరు చేరితే ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండుతుందన్నారు.

దాతల సహకారంతో కోనేరు పనులు పూర్తి
చిన్నచింతకుంట : మండల పరిధిలోని అమ్మపూర్ గ్రామసమీపంలో ఏడుకొండలపై వెలసిన కురుమూర్తిస్వామి కోనే రును దాతలతోపాటు, సామాజిక వెత్త హైకోర్టు న్యాయవాధి గౌని మధు సూదన్‌రెడ్డిలు కోనేరు తూర్పు భాగంలో మెట్లు స్థితిలావస్థలో ఉండటం తో బ్రహ్మోత్సవాలు, జా తరలో భక్తులు పవిత్ర స్నానా లు చేసేందుకు చా లా ఇబ్బ ందులు పడేవా రని, ఇది దాతలు గమని ంచి రూ.10 లక్షల పైచి లుకు ఖర్చుచేసి ని ర్మాణ పనులు పూర్తి చేస్తున్నట్లు ఆలయ సిబ్బ ంది ద్వారా తెలిసింది. మరో 3 రోజు ల్లో పనులు పూర్తి చేసి దేవస్థానానికి అప్పగించనున్నట్లు తెలిపారు.

68
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...