ఆహ్లాదకర వాతావరణంలో విద్యాబోధన


Sun,October 20, 2019 04:45 AM

రాజోళి: హరితహారంతో పర్యావరణంలో వచ్చే మార్పులు అన్నీ ఇన్నీ కాదు... సకాలంలో వర్షాలు కురవాలన్నా, గ్రామంలో ఆరోగ్యకర వాతావణం ఏర్పడాలన్నా, కాలుష్యాన్ని మానవుల దరిచేరకుండా చూడాలన్నా, చెట్లే కీలకపాత్ర పోషిస్తాయి. అలాంటి చెట్లను అనేక కారణాలతో తొలగించిగా.. గ్రామాల్లో హరితవనాలుగా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణకు హరితహారంతో గ్రామాల్లో మళ్లీ పచ్చదనం జీవం పోసుకుంటున్నది. ఆరంభంలో కొంత నిర్లక్ష్యం కనిపించినా.. అందరూ సీఎం కేసీఆర్ మాటలను ఆదర్శంగా తీసుకుని మొక్కల పెంపకంపై దృష్టి పెడుతున్నారు. ఆ కోవలోనే మాన్‌దొడ్డి జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాల అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నది. రాజోళి మండలంలోని మాన్‌దొడ్డి జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాల చాలా విశాలమైన స్థలంలో ఉండగా.. ప్రహరీ లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. విద్యార్థుల ఇబ్బందులను వదిలేసి పాఠశాలలో నూతన శోభ సంతరించుకునేందుకు పూనుకున్నారు. దానికోసం కేసీఆర్ మాటలను, సందేశాన్ని ఆదర్శంగా తీసుకున్నారు. పాఠశాల ఆవరణలో విరివిగా మొక్కలు నాటారు. వీరికి పాఠశాల సిబ్బంది తోడ్పాటు అందించారు. మొక్కలు నాటి వదిలేయకుండా నిత్యం వాటికి నీరు పోయడం, అవి పెరిగి పెద్దయ్యేవరకు సంరక్షణ చర్యలు చేపట్టారు. పాఠశాలకు సెలవులు ఉన్న రోజుల్లో కూడా విద్యార్థులు మొక్కలకు నీరు పోస్తూ.. వాటిని సంరక్షించారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా వారు నాటిన మొక్కలు నేడు పెద్ద చెట్లుగా మారి, పాఠశాల ప్రాంగణం అంతా పచ్చదనం సంతరించుకున్నది. పాఠశాలను చూడగానే హరితవనంలో సరస్వతీ నిలయంగా అందరి దృష్టిని ఆకర్శిస్తుంది. కార్పొరేట్ పాఠశాలలో కూడా లేనివిధంగా పచ్చదనాన్ని సంతరించుకున్న ఈ పాఠశాలపై తరుచూ అందరూ చర్చించుకుంటారు.

ఆహ్లాదకర వాతావరణం
పాఠశాల ప్రహరీలో పచ్చదనం సంతరించుకోవడంతో ఆహ్లాదకర వాతావరణం ఏర్పడింది. పాఠశాల రోజుల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆ చెట్ల కిందనే సేద తీరుతారు. సెలవురోజుల్లో, వేసవికాలంలో గ్రామస్తులు కూడా కాలక్షేపానికి ఆ చెట్ల కింద మాట్లాడుతూ గడపగా. మరి కొందరు అక్కడ ఉండే చల్లటి వాతావరణంలో హాయిగా నిద్రకు ఉపక్రమిస్తుంటారు. పిల్లలు ఆడుకోవడానికి కూడా అక్కడే సరైన ఆట స్థలంగా అందరూ భావిస్తారు. ఈ పాఠశాలను ఆదర్శంగా చూపి మిగతా పాఠశాలల్లో కూడా చెట్లను పెంచడంపై విద్యార్థులకు సూచనలిస్తుంటారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...