కొత్త కొత్తగా..


Sat,October 19, 2019 02:52 AM

-పారని పాత పాచిక
-సిండికేట్లకు చుక్కెదురు
-ముగిసిన 29 మద్యం షాపుల కేటాయింపు
-ఏపీ వ్యాపారులకు ఐదు, మహిళల మూడు షాపులు
-లక్కీడ్రా తీసిన కలెక్టర్ శ్వేతామొహంతి

వనపర్తి ప్రతినిధి, నమస్తే తెలంగాణ : పది రోజులుగా కొనసాగిన మద్యం షాపుల టెండర్ల ప్రక్రియ ఎట్టకేలకు ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలో 29 మద్యం షాపులకు వారం రోజుల పాటు దరఖాస్తులను స్వీకరించిన ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన లక్కి డ్రాను కలెక్టర్ శ్వేతామొహంతి తీసి ఎంపికలు పూర్తి చేశారు. స్థానికులు, స్థానికేతరులు, పా త, కొత్త వ్యాపారులు ఈ షాపుల కోసం పోటా.. పోటీ లు పడగా అదృష్టం కొందరినే వరించింది. ఈనెల 9 నుంచి 16వ తేదీ వరకు దరఖాస్తులకు గడువిచ్చిన క్ర మంలో మొత్తం 516 మంది మద్యం షాపుల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. ఈమేరకు లక్ష్మీకృష్ణా ఫం క్షన్ హాల్‌లో లక్కీడ్రా కార్యక్రమం కలెక్టర్ శ్వేతామొహ ంతి, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ జయసేనారెడ్డిల ఆధ్వర్యంలో జరిగింది. ముందుగా 1వ షాపు నుంచి లక్కీ డ్రా తీసిన కలెక్టర్ చివరి 29వ షాపు వరకు కొనసాగించారు. ఈ పద్ధతిన ఆయా షాపులకు 29 మంది ఎంపికలను చేసి నిర్వాహకులకు ధ్రువీకరణ పత్రాలను కలెక్టర్ అందించారు. కాగా, ప్రత్యేక అధికారి వివేక్, ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్‌పెక్టర్లు సుభాశ్, మల్లికార్జున్, ఓంకార్‌ల పర్యవేక్షణలో డ్రా కార్యక్రమం కొనసాగింది.

కొత్త వారికే అత్యధికం..
మద్యం దరఖాస్తుదారుల్లో స్థానికులు, స్థానికేతరులు, పాత, కొత్త వ్యాపారస్తులు అనేకం షాపుల కోసం పోటీలు పడ్డారు. లక్కీడ్రా ద్వారానే ఎంపికలు కొనసాగినందున అత్యధికంగా కొత్త మొఖాలకే మద్యం షాపుల నిర్వహణ వరించింది. పలు బృందాలుగా పాత వ్యాపారస్తులు ఏర్పడి దరఖాస్తులు చేసుకున్నా ఫలితం లేకుండా పోయింది. అత్యంత శ్రద్ధతో వేసిన వారికి మొండి చేయి రాగా, నామమాత్రంగా దరఖాస్తులు చేసిన మరికొందరికీ అదృష్టం వరించింది. లక్కీడ్రా అనంతరం ప్రస్తుతం వైన్స్ షాపులను నిర్వహిస్తున్న వారికి కొత్త షాపులు రాకపోవడంతో నిరాశకులోనయ్యారు. ఇదిలా ఉంటే, పెబ్బేరు, కొత్తకోట, వనపర్తిలలో ఎక్కువ షాపులు స్థానికంగా ఉండి దరఖాస్తులు చేసిన వారికి అవకాశం రాలేదు. కొత్తకోటలో ఉన్న వారికి పెబ్బేరు, పెబ్బేరులో ఉన్న వారికి కొత్తకోట ప్రాంతాల్లో షాపులు దక్కాయి. కాగా, పెబ్బేరులో స్థానికులు ఉత్సాహంగా దరఖాస్తులు చేసినప్పటికీ ఒక్కషాపు కూడా దక్కక పోవడం నిరాశకులోను చేసింది.

మహిళలకు మూడు షాపులు
జిల్లా వ్యాప్తంగా మద్యం షాపులకు 516 దరఖాస్తులు రాగా, వీటిలో 56 దరఖాస్తులు మహిళలు చేసుకున్నారు. జిల్లాలోని 29 షాపులకుగాను మూడు షాపులు మహిళలకు వచ్చాయి. వీటిలో వనపర్తిలోని 5వ షాపు, గోపాల్‌పేట, ఆత్మకూరు మద్యం షాపులు మహిళలకు దక్కాయి. ఈ షాపులు మహిళల పేరుతో వచ్చినా.. వారి కుటుంబ సభ్యులే నిర్వహణ చూస్తారు. సెంటిమెంట్ పరంగాను వీరు మహిళల పేర్లతో దరఖాస్తులు దాఖలు చేసి షాపులను దక్కించు కోవడంతో వీరి కుటుంబాల్లో ఆనందం వెళ్లి విరిసింది. మద్యం షాపుల ప్రక్రియలో ఎలాంటి రిజర్వేషన్లు లేకున్నా మహిళల ప్రాతినిద్యం సెంట్‌మెంట్‌పరంగా బయటకు వస్తుంది. ఇదిలా ఉంటే, సిండికేట్‌గా అనేక బృందాలు మద్యం షాపుల కోసం చేసిన పాచికలు ఏమాత్రం పారలేదు. అత్యధిక షాపులు కొత్త మొఖాలకు రావడంతో సీనియర్ సిండికేట్‌లంతా ఖంగుతిన్నారు. షాపులు వచ్చిన వారితో అవకాశం ఉంటే కలవడానికి ప్రయత్నాలు చేసుకున్నారు.

స్థానికేతరులకు ఏడు దుకాణాలు
పోటాపోటీగా కొనసాగిన మద్యం షాపుల ఎంపిక ప్రక్రియ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. పది రోజులుగా వేసుకున్న గణాంకాలన్నీ పటాపంచలయ్యాయి. ఏ ప్రాంతానికి చెందిన వారైన దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం ఉండటంతో ఏపీకి చెందిన వారు కొందరు దరఖాస్తులు చేసుకున్నారు. గతంలో అనేక షాపులను ఇతర ప్రాంతాలకు చెందిన వ్యక్తులు నిర్వహించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు కూడా 29 షాపుల్లో అనేకం ఇతర ప్రాంతాల వారు దరఖాస్తులు చేసినప్పటికీ ఏడు దుకాణాలు స్థానికేతరులను వరించాయి. ఇందులో ఐదు దుకాణాలు సీమాంధ్రులకు, రెండు దుకాణాలు తెలంగాణ (ఒకటి నల్గొండ, మరొకటి రంగారెడ్డి జిల్లాలు) వారికి దక్కాయి. ఈ షాపులను వారి నుంచి స్థానికులు బేరసారాలు చేసుకుంటున్నట్లు తెలిసింది.

77
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...