పట్టణంలో ఆర్టీసీ కార్మికుల మహార్యాలీ


Sat,October 19, 2019 02:50 AM

వనపర్తి విద్యావిభాగం : తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన నిరసన కార్యక్రమా లు, సమ్మె శుక్రవారం 14వ రోజుకు చేరింది. పెద్ద ఎత్తున కాంగ్రెస్, బీజేపీ, డీఎస్పీ, సీపీఎం, సీఐటీ యూ, ఏఐటీయూసీ, విద్యార్థి సం ఘాలు ఎస్‌ఎఫ్‌ఐ, పీడీఎస్‌యూ, ఏబీవీపీ, ఎంఎస్‌ఎఫ్, ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు యూటీఎఫ్, డీటీఎఫ్, తపస్, పీఆర్టీయూ, ఎంఈఎఫ్, టీటీఎఫ్, ఎస్టీయూ, డీటీఏ సంఘాల సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో మహా బైక్ ర్యాలీ నిర్వహించారు. వనపర్తిలోని కొత్తకోట రోడ్డు, గాంధీచౌక్, అంబేద్కర్‌చౌక్, డిపో రోడ్డు మీదుగా ర్యాలీ కొనసాగింది. రాజీవ్ చౌరస్తాకు ర్యాలీ చేరుకోగా ఉపాధ్యాయ, ఉద్యోగ, ఆర్టీసీ కార్మికులు మెడకు ఉరి వేసుకొని ఆత్మహత్య ప్రదర్శన చేశారు. కోర్డు ఇచ్చిన ఆదేశాలను అమలు చేసి చర్చలకు పిలిచి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. శనివారం జరిగే బంద్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆయా పార్టీల, సంఘాల నాయకులు పాల్గొన్నారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...