ప్రయాణం.. ప్రశాంతం


Sat,October 19, 2019 02:50 AM

వనపర్తి విద్యావిభాగం : ఆర్టీసీ సమ్మె కారణంగా ఆర్టీసీ, ఆర్టీవో, రెవెన్యూ ఆధ్వర్యంలో ప్రయాణికులకు ఇక్కట్లు కలుగకుండా బస్సులను నడుపుతున్నారు. శుక్రవారం 65 ఆర్టీసీ, 18 అద్దె బస్సులు మొత్తం 83 బస్సులను నడిపారు. కాగా గురువారం ఒక్కరోజే రూ.7.52లక్షల ఆదాయం ఆర్టీసీ గడించింది. టిమ్ములు లేనప్పుడు రూ.2లక్షల నుంచి రూ.3లక్షలు మాత్రమే ఆదాయం వచ్చేది. టిమ్ములను అమలులోకి తీసుకురావడంతో ఆదాయం పెరిగింది. షిప్టుల వారిగా పది రెవెన్యూ సహకార సంఘం సిబ్బందితో యథావిదిగా బస్సులు నడిచేలా చర్యలు చేపట్టారు. ఎలాంటి ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకోకుండా ఆర్టీసీకి నష్టం రాకుండా పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేసి వాహనాలు నడుపుతున్నారు.

67
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...