జాతీయ స్థాయిలో విజయం సాధించాలి


Sat,October 19, 2019 02:50 AM

వనపర్తి క్రీడలు : ఇటీవల వనపర్తిలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల నుంచి జాతీయ స్థాయి పుట్‌బాల్ జట్టుకు ఎంపికైన క్రీడాకారిణులు పట్టుదలతో ఆడి విజయం సాధించాలని ఎస్జీఎఫ్ సెక్రటరీ సుధీర్‌కుమార్ రెడ్డి కోరారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని బాలకిష్టయ్య మైదానం నుంచి జాతీయ స్థాయి అండర్-17 విభాగం పుట్‌బాల్ బాలికల జట్టు క్రీడాకారిణులకు వనపర్తి పట్టణానికి చెందిన శ్రీనివాసులు స్వంత డబ్బులతో క్రీడాదుస్తులను అందజేశారు. ఈ సందర్భంగా సుధీర్ మాట్లాడుతూ గ్రామీణ స్థాయి నుంచి ఎంతో కష్టపడి జిల్లా, రాష్ట్ర స్థాయిలో రాణిస్తూ జాతీయ స్థాయికి ఎంపికైన క్రీడాకారిణులు ప్రతిభ కనబరిచి రాష్ట్రంతో పాటు జిల్లాకు పేరు ప్రతిష్టలను తీసుకురావాలన్నారు. క్రీడాకారిణుల వెంట కోచ్‌గా సోలీపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల పీఈటీ మణ్యం, మేనేజర్‌గా కల్వరాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఎండీ షబీర్‌లను ఎంపిక చేసినట్లు తెలిపారు. అనంతరం పుట్‌బాల్ పోటీలకు ఎంపికైన క్రీడాకారిణులను అభినందించారు. ఈ కార్యక్రమంలో పీడీ సురేందర్‌రెడ్డి, పీఈటీలు నందిమళ్ల తిరుపతి, స్టేడియం కోచ్ రాములు, సీనియర్ క్రీడాకారులు ఉన్నారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...