వంటింటి వ్యర్థాలతో నాణ్యమైన ఎరువు


Sat,October 19, 2019 02:50 AM

ఆత్మకూరు, నమస్తే తెలంగాణ : వంటింటి వ్యర్థాలతో నాణ్యమైన ఎరువును తయారు చేసుకోవచ్చని డీఈవో సుశీందర్‌రావు పేర్కొన్నారు. శుక్రవారం అమరచింత, ఆత్మకూరు మండలాలకు గాను ఆత్మకూరు మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో హోం కంపోస్టింగ్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈవో మా ట్లాడుతూ ఇళ్లనుంచి వెలువడే చెత్త నుంచి ప్రతి ఒక్కరూ నాణ్యమైన సేంద్రియ ఎరువును తయారు చేసుకోవచ్చన్నారు. చెత్తను ఇంట్లో పెట్టుకోవడం వల్ల దుర్వాసన వస్తుందన్న భావనను విడనాడి ఇంటిల్లిపాదులు ఆరోగ్యంగా ఉండాలన్నా, ఆరోగ్యమైన ఆహారం పొందాల న్నా సేంద్రియ ఎరువు ఎంతో సురక్షితమన్నారు. అనంతరం హోం కంపోస్టింగ్‌పై ప్రముఖ శి క్షకురాలు అరుణశేఖర్ అవగాహన క ల్పించారు. ఇంట్లో నిత్యం వాడే పదార్థాల నుంచి వచ్చే వ్యర్థాలు, చెత్త నుం చి సులభదాయకంగా ఎరువును సి ద్ధం చేసుకోవచ్చన్నారు. వ్యర్థాల నుం చి తయారు చేసుకున్న ఎరువును మొక్కలకు, కూరగాయల తోటకు, మిద్దె మీద పెంచుకునే పోషకాహార మొక్కలకు చల్లుకోవచ్చన్నారు. ప్రతి ఒక్కరూ ఈ పద్ధతిని అవలంభించి ఇంటిని, పరిసరాలను, ఆరోగ్యాన్ని ప రిరక్షించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో స్పె షల్ ఆఫీసర్ విజయ్‌భాస్కర్‌రెడ్డి, ఎంపీడీవో శ్రీపాద్, అ మరచింత ఎంపీడీవో ఖాజా మైనోద్దీన్, ఎంఈవో భాస్కర్‌సింగ్, శిక్షకులు ఇందిరభారతి, రాజు, ఉమ్మడి మండలాల ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ టీచర్లు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...