అనుమతులు లేని..క్లినిక్‌లు సీజ్


Fri,October 18, 2019 03:08 AM

-జిల్లాలో డీఎంహెచ్‌వో ఆకస్మిక దాడులు
-వనపర్తిలో నాలుగు, పెబ్బేరులో మూడు సీజ్
-రెండు దుకాణాలలో రూ.67,170 విలువైన బయో మందులు సీజ్
-అనుమతి లేని మందుల శ్యాంపిల్స్ సేకరణ
-పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపుతాం
-విజిలెన్స్ సీఐ టీఎన్ రాజు

అయిజ : అయిజ పట్టణంలోని పెస్టిసైడ్స్ దుకాణాలపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. విజిలెన్స్ ఎస్పీ చిట్టిబాబు ఆదేశాల మేరకు పెస్టిసైడ్స్ దుకాణాలపై దాడులు చేపట్టగా బయో మందులు విక్రయిస్తున్నట్లు కనిపెట్టారు. గురువారం పట్టణంలోని సిద్ధేశ్వర పెస్టిసైడ్స్, కట్టకింద తిమ్మప్పస్వామి పెస్టిసైడ్స్ దుకాణాలలో అనుమతి లేని బయో మందులను విక్రయిస్తున్నట్లు తమ దృష్టికి రావడంతో వాటిని సీజ్ చేసినట్లు సీఐ తెలిపారు. సిద్ధేశ్వర పెస్టిసైడ్స్ దుకాణంలో రూ.38,770, కట్టకింద తిమ్మప్పస్వామి దుకాణంలో రూ. 28,400 విలువ చేసే బయో మందులను సీజ్ చేయడంతోపాటు ల్యాబ్ పరీక్షల నిమిత్తం శ్యాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపుతున్నట్లు సీఐ వెల్లడించారు.

పరీక్షల నివేదిక అందిన వెంటనే తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. అనుమతి లేని మందులను విక్రయిస్తే పెస్టిసైడ్స్ దుకాణాలపై చర్యలు తప్పవన్నారు. రైతులు కొనుగోలు చేసే ముందు అన్ని రకాలుగా తెలుసుకుని మందులను కొనుగోలు చేయాలని సూచించారు. ఈ దాడులలో విజిలెన్స్ ఏవో మల్లారెడ్డి, అయిజ ఏవో శంకర్‌లాల్, విజిలెన్స్ కానిస్టేబుల్ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...